ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : అఖిల భారత సగర మహాసభ సంఘం పేరు చెప్పి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విజయేంద్ర సగరతో పాటు పాత కమిటీ సభ్యులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అఖిల భారత సగర మహాసభ నేతలు కొండ అనిల్ కుమార్ సగర, దామోదర్ సగర స్పష్టం చేశారు. వారి కాలపరిమితి పూర్తయి పోవడంతో ఆ కమిటీని పరిగణలోకి తీసుకోవడం లేదని అన్నారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమకు తాము అధ్యక్షులమని ప్రకటించుకొని కొనసాగుతూ అవినీతికి పాల్పడుతూ సంఘాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. వీరి అవినీతి వల్ల సంఘం అభివృద్ధితోపాటు, కులస్తుల సంక్షేమం కుంటుపడిందని అన్నారు. కోర్టు వారు సైతం సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని సూచించడంతో తాము త్వరలో ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అఖిల్ సగర, భాస్కర్ సగర, వినోద్ కుమార్ సగర, ముఖేష్ సగర, వేణుగోపాల్ సగర తదితరులు పాల్గొన్నారు.




