పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: విద్యా సంస్థలో చేరిన ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ కెరీర్‌లో విజయం సాధించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వెలిమెల తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎ.రాంప్రసాద్ సూచించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు గురువారం కొత్తగా చేరిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాంప్రసాద్ మాట్లాడుతూ… గత 10 సంవత్సరాలుగా ఈ సంస్థ నుండి ఉత్తీర్ణులైన విద్యార్థులు భారతదేశం, విదేశాలలో వివిధ ముఖ్యమైన కోర్సులలో చేరి నిపుణులుగా స్థిరపడ్డారని అన్నారు. వారు ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌లు, ఈ సంస్థకు ప్రశంసలు తెచ్చారని తెలిపారు . పదేళ్ల ఉనికిలో ఈ సంస్థ రాష్ట్రంలోని అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ బ్యాచ్ విద్యార్థులు కూడా మంచి మార్కులు, ర్యాంకులు సాధించాలని ఆయన సూచించారు. విద్యార్థులు తమ జూనియర్‌లకు స్వాగతం పలికేందుకు వివిధ ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజయం సాధించేందుకు తమ జూనియర్లకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.




