విజయభేరి సభకు ఇబ్రహీంపట్నం నుండి వేలాదిగా తరలివచ్చి సోనియా సభను విజయవంతం చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 16 : ఈసి.శేఖర్ గౌడ్ (మామ) తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు వేదిరే యోగేందర్ రెడ్డిలు ప్రజాతంత్రతో  మాట్లాడుతూ, తుక్కుగూడ విజయభేరి సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో శ్రీనగర్ కాలనీ వద్ద నిర్వహించే విజయభేరి బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే,సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ తదితర ప్రముఖులు తరలివస్తున్న శుభసందర్భంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు ఈసారి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందున ప్రతి ఒక్కరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు రావాల్సిగా వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *