వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: విజయ దశమి అన్ని విధాలుగా కలిసి వచ్చి ప్రతి ఒక్కరు సుభిక్షంగా వర్ధిల్లాలని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హాజీ పాషా పేర్కొన్నారు. విజయదశమి వేడుకల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని బోనమ్మ ఆలయం మైదానంలో నిర్వహించిన రావణుడి దహన కార్యక్రమం జమ్మి పూజా కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చిన హిందూ మిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన ముస్లిం సోదరులు. ప్రతి ఒక్కరూ పండగలను సోదర భావంతో జరుపుకోవడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. కులాలకు మతాలకు అతీతంగా పండగలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాష ఆనందం వ్యక్తం చేశారు.
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు హాజీ పాషా





