మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 31: మా గుండె పదిలం కోసం బాటలు వేసారు.. సమాజం బాగు కోసం నిరంతరం కృషి చేస్తూ.. నియోజకవర్గాన్ని సొంత ఇంటి లాగా తీర్చిదిద్దుతున్న మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి పూర్తి మద్దతుగా.. ఆమె వెన్నంటే ఉండి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చందనం చెరువు వాకర్స్, సీనియర్ సీటీజన్లు, యువత, మహిళలు తమ మద్దతు ప్రకటించి, ముక్త కంఠంతో చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున చందనం చెరువుకు చేరుకున్న సబితమ్మ సంపూర్ణ ఆరోగ్యం కోసం మార్నింగ్ వాక్, జాగింగ్, కసరత్తులు చేస్తున్న సీనియర్ సీటీజన్లు, యువత, మహిళలను ఆప్యాయంగా పలకరించి, జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. ఈ సందర్భంగా వాకింగ్ కు వచ్చిన ప్రజలు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడుతూ.. కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు సెదదిరేలా గొప్ప విజన్ తో మంత్రిగా కోట్లాది రూపాయల నిధులు తెచ్చి చందనం చెరువును అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత మీకే తగ్గుతుందని మంత్రిపై వాకింగ్ కు వచ్చిన ప్రజలు ప్రశంసల జల్లులు కురిపించారు. చందన చెరువును సుందరీకరణ చేయడమే కాకుండా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో పాటు మహిళలు, పిల్లలు సేద తీరేవిదంగ అద్భుతంగా చెరువును తీర్చి దిద్దినట్లు కొనియాడారు. అదే విధంగా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఎంతో మేలు చేకూరుతుందని యువకులు పేర్కొన్నారు. ఇంత చేసినా సబితా ఇంద్రారెడ్డికే మా మద్దతు ఉంటుందని ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో చెప్పారు.ఈ సందర్భంగా బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. జంట కార్పొరేషన్ల పరిదిలో గల 11 గొలుసు కట్టు చెరువులను రూ.40 కోట్ల భారీ నిధులు వెచ్చించి, ఆధునికీకరణ, సుందరీకరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. పచ్చని పార్క్ లతో స్వచ్ఛమైన గాలి లభించేలా కృషి చేసినట్లు తెలిపారు. ఆయా చెరువుల సమీపంలో పార్కులు నిర్మించి, పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దినట్లు పేర్కొన్నారు. చెరువు లోతట్టు ప్రాంతాల ముంపు సమస్య పరిష్కారానికి రూ.110 కోట్లు వెచ్చించి, నాలల అభివృద్ధి చేసి, వరద నీటి ముంపు సమస్యకు పరిష్కారం చేపట్టినట్లు చెప్పారు. చందనం చెరువు, మంత్రాల చెరువుల్లో డ్రైనేజీ నీరు రాకుండా రూ.23 కోట్లతో ట్రంక్ లైన్ నిర్మించామన్నారు. ట్రంక్ పైపు లైన్ నిర్మాణంతో మురుగు నీటి సమస్య తీరడంతో పాటు కాలనీల్లో దోమల బెడద, దుర్వాసన దుస్తితి తీరినట్లు చెప్పారు. మరింత అభివృద్ధి కోసం మరొక్కసారి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. తప్పకుండా అండగా ఉండి, కారు గుర్తుపై ఓటు వేసి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు హామీ ఇచ్చారు.
విజన్ గల నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికే మా ఓటు చందనం చెరువు వాకర్స్





