వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఉద్యోగుల ఫోరం అధ్యక్షులుగా రామకృష్ణను ఎన్నుకున్నారు. తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల జిల్లా ఫోరం సర్వసభ్య సమావేశం ఆర్ జే ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఎం శివకుమార్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఉద్యోగుల జిల్లా కార్యవర్గం ఎన్నుకోవడం జరిగినది జిల్లా అధ్యక్షుడుగా ఎం.రామకృష్ణ జూనియర్ అసిస్టెంట్ వికారాబాద్ మున్సిపాల్టీ, కార్యదర్శిగా ఆంజనేయులు జూనియర్ అసిస్టెంట్ తాండూర్ మున్సిపాలిటీ అసోసియేషన్ అధ్యక్షులుగా పి సంపత్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ పార్కింగ్ మున్సిపాల్టీ ట్రెజరీగా విట్టల్ సీనియర్ అసిస్టెంట్ వికారాబాద్ మున్సిపాలిటీ మరియు ఇతర కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అడక్ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ పర్వతాలు టీఎన్జీవో జిల్లా కార్యదర్శి ఎం డి అఫ్జల్ పాషా మున్సిపల్ రెవిన్యూ అధికారి జాన్ కృపాకర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ .శివకుమార్ మరియు వికారాబాద్ జిల్లాలోని (4) మున్సిపాలిటీ ఉద్యోగులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.


