వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 8: బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆనంద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పండిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధికి ఎలాంటి పాటుపడలేదని 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా నిలిచి అభివృద్ధికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే ఆనంద్




