వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపులను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి దరఖాస్తుదారుల సమక్షంలో వైన్ షాపుల కేటాయింపు కొరకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 59 వైన్ షాపుల కేటాయింపు ప్రక్రియ లక్కీ డ్రా పద్ధతిన పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



