వికలాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహించాలి

వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: వికలాంగుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధికి కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ పేర్కొన్నారు.
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ ఆధ్వర్యంలో  తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడిన సోనియా గాంధీ జన్మ దినోత్సవ వేడుకలు, ముఖ్యమంత్రిగా వికారాబాద్ జిల్లా వాసి కొడంగల్ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి ఎన్నికైనందున, అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ  నాయకత్వంలో  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పాటుపడడంతో పాటు వికలాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తారని వికలాంగుల దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి  బాధ్యతలు స్వీకరించడం బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే వికలాంగురాలికి ఉద్యోగ అవకాశం కల్పించడం వికలాంగుల సమాజం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. మున్ముందు కూడా ముఖ్యమంత్రి  వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పరిగి మండల అధ్యక్షులు లక్ష్మయ్య. ఉపాధ్యక్షులు నర్సిములు  దోమ మండల నాయకులు చుక్కయ్య దారుర్ మండల్ నాయకులు బాల్ రాజు  ఆనంద్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *