పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 11: ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా సంగారెడ్డి జిల్లాలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం పటాన్ చెరు పరిధిలోని ఇక్రిశాట్ చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీలో కారులో తరలిస్తున్న నలుగురు వ్యక్తుల నుండి రూ.9 లక్షల 95 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులు లెక్కని చూపని కారణంగా డబ్బులను సీజ్ చేసినట్లు పటాన్ చెరు క్రైమ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ రెడ్డిలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నందున, ఈసీ నియమ నిబంధనల ప్రకారం పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే వాటికి సంబంధించిన రసీదులు తప్పకుండా చూపాలని అన్నారు. లేనిపక్షంలో రసీదులు లేకుండా 50 వేలకు పైగా డబ్బులు ఉంటే కచ్చితంగా సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు.
వాహన తనిఖీలో రూ.9 లక్షల 95వేలు సీజ్



