వారణాసి కేసులో కోర్టు కీలక తీర్పు

  • శివలింగం కాలాన్ని నిర్థారించాలన్న వాదనకు చెక్‌
  • ‌కుదరదని తేల్చిచెప్పిన జిల్లా కోర్టు

వారణాసి, అక్టోబర్‌ 14 : ఉత్తర ప్రదేశ్‌ ‌వారణాసిలో ఉన్న జ్ఞానవాపి శివలింగం కాలాన్ని కార్బన్‌ ‌డేటింగ్‌ ‌ద్వారా నిర్థరించాలని దాఖలైన పిటిషన్‌ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. ఇక్కడి మసీదు ప్రాంగణంలో కనిపించిన శివలింగం వంటి నిర్మాణానికి కార్బన్‌ ‌డేటింగ్‌ ‌లేదా ఏదైనా ఇతర సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌చేయించాలని పిటిషనర్‌ ‌కోరారు. శివలింగం వంటి నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించాలని కోర్టు ఆదేశించిందని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ శివలింగానికి కార్బన్‌ ‌డేటింగ్‌ ‌చేయించాలన్న వాదనను ముస్లిం పక్షాలు అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే.

కార్బన్‌ ‌డేటింగ్‌ ఆచరణ సాధ్యం కాదని అంజుమన్‌ ఇం‌తెజామియా మసీదు కమిటీ వాదించింది. రాయికి కార్బన్‌ ‌డేటింగ్‌ ‌చేయడం సాధ్యం కాదని పేర్కొంది. రాయి అంటే ఆర్గానిక్‌ ‌పదార్థం కాదని తెలిపింది. మసీదు ప్రాంగణంలో నిర్వహించిన సర్వేలో శివలింగం కనిపించిందని హిందూ పక్షాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రదేశాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ శివలింగం కాలాన్ని నిర్థరించడానికి కార్బన్‌ ‌డేటింగ్‌ ‌లేదా ఏదైనా ఇతర సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌చేయించేందుకు అనుమతించడం లేదని వారణాసి జిల్లా కోర్టు శుక్రవారం తెలిపింది.

ఇది శివలింగం కాదని, ఫౌంటెయిన్‌ అని వాదించింది.  వాదనలను విన్న వారణాసి జిల్లా జడ్జి ఏకే విశ్వేశ హిందువుల అభ్యర్థనను తోసిపుచ్చారు. ’శివలింగం’ వయసు, దాని స్వభావాలను నిర్థరించాలని ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియాను ఆదేశించడం సరైనది కాదని తెలిపారు. వ్యాజ్యంలోని ప్రశ్నలకు సమాధానాలను ఈ ఆదేశాల ద్వారా నిర్థరించడం సాధ్యం కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *