వాతావరణ సంక్షోభం నివారణకు మిషన్‌ ‌లైఫ్‌

  • గుజరాత్‌ ‌కేవడియాలో ప్రారంభించిన మోదీ
  • ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ గుటేరస్‌ ‌హాజరు

అహ్మదాబాద్‌,అక్టోబర్‌20 : ‌వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన హిమానీ నదులు కరిగిపోతున్నాయని, నదులు ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు. గుజరాత్‌ ‌కెవడియాలో ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ అంటోనియా గుటేరస్‌ ‌తో కలిసి మిషన్‌ ‌లైఫ్‌ ‌ప్రోగ్రాంను మోడీ ప్రారంభించారు. అనంతరం మోడీ ప్రసంగించారు. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మిషన్‌ ‌లైఫ్‌ ‌సహాయం చేస్తుందని చెప్పారు. ప్రజలు కూడా జీవన శైలిని మార్చుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ప్రధాని సూచించారు. ప్రపంచంలోని 80 శాతం కాలుష్యం జీ 20 దేశాల్లో ఉందని ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ అంటోనియా గుటేరస్‌ ‌తెలిపారు. అందుకే జీ 20 దేశాలు పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలని సూచించారు. వ్యక్తులు, సంఘాలు  కూడా పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని గుటేరస్‌ ‌చెప్పారు.

కకాగా, సుస్థిర అభివృద్ధి దిశగా ప్రజల సమిష్ఠి వైఖరిని మార్చడానికి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడమే మిషన్‌ ‌లైఫ్‌ ‌లక్ష్యం. సులువుగా, సమర్థవం తంగా ఉండే పర్యావరణ హితకరమైన పనులు చేసేవిధంగా ప్రజలను ప్రోత్సహించడం, ఈ పనులను ప్రజలు తమ దైనందిన జీవితంలో ఆచరించే విధంగా ప్రేరేపించడం, మారుతున్న డిమాండ్‌కు తగినట్లుగా వేగంగా స్పందించేవిధంగా పరిశ్రమలు, మార్కెట్లను ప్రోత్సహించడం, సుస్థిర వినియోగానికి, ఉత్పత్తికి మద్దతునిచ్చే విధానాలను రూపొందించాలని ప్రభుత్వాలను, పరిశ్రమలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. ఇక అంతకు ముందు దేశంలోనే మొట్టమొదటి సోలార్‌ ‌పవర్డ్ ‌గ్రామాన్ని, మొధేరాలోని సూర్య దేవాలయాన్ని గుటేరస్‌ ‌సందర్శించారు. ఇదిలావుంటే వాతావరణ మార్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ’మిషన్‌ ‌లైఫ్‌’‌ను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్, ‌యూకే, మల్దావులుతో సహా  పలువురు ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. తామంతా బాసటగా నిలుస్తామని తెలిపారు.

ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ ‌మెక్రాన్‌ ఒక వీడియో సందేశంలో డియర్‌ ‌నరేంద్ర.. వచ్చే ఏడాది జి20 అధ్యక్ష స్థానంలోకి వస్తున్న ఇండియాతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాం అని అన్నారు. కెవాడియాలో మిషన్‌ ‌లైఫ్‌ ‌ప్రారంభించిన ప్రత్యేక సందర్భంలో తాను అందరితో కలిసి ఉన్నట్టుగా భావిస్తున్నానని, ప్రపంచ దేశాల్లో జియాపొలిటికల్‌ ‌టెన్షన్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సహకారం అవసరమని మెక్రాన్‌ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 1‌వ తేదీ నుంచి జి20 గ్రూప్‌ అధ్యక్ష పగ్గాలను ఏడాది పాటు ఇండియా చేపట్టనుంది. మిషన్‌ ‌లైఫ్‌ ‌ప్రారంభించిన మోదీకి బ్రిటన్‌ ‌ప్రధాని లిజ్‌ ‌ట్రస్‌ ‌కూడా ఒక వీడియో సందేశంలో అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యదేశాలుగా ఎనర్జీ ఇండిపెండెన్స్, ‌ప్రొటెక్ట్ ఎకానస్‌కు సాధించేందుకు కలిసికట్టుగా మనం పనిచేయాలని, కీలకమైన •-లకైమేట్‌ ఇన్‌‌ఫ్రా డవలప్‌ ‌కోసం ఇండియా వంటి భాగస్వాములతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. మిషన్‌ ‌లైఫ్‌ ‌ప్రారంభించిన భారత నాయకత్వాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు.

మరోవైపు మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్‌ ‌సొలిస్‌ ‌సైతం ప్రధాని మోదీ  మిషన్‌ ‌లైఫ్‌కు అభినందనలు తెలిపారు. వాతావరణ సంక్షోభం ప్రపంచ దేశాల్లో తీవ్రమవుతున్న కీలక దశలో మిషన్‌ ‌లైఫ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఎస్టోనియా  ప్రధానమంత్రి కాజ కల్లాస్‌  ‌తన సందేశంలో ప్రధాని మోదీని అభినందిస్తూ, వాతావరణ మార్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అంతా సమష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. వరల్డ్ ‌క్లీనింగ్‌ ‌డేలో ఇండియా ఎంతో చురుకుగా పాల్గొందని, గత ఏడాది 1.2 మిలియన్ల ప్రజలు అందులో పాల్గొనడం ఎంతో ఆకట్టుకుందని అన్నారు. జార్జియా ప్రధాని ఇరాక్లి గారిబస్‌విలి సైతం మోదీ ప్రారంభించిన మిషన్‌ ‌లైఫ్‌ను స్వాగతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *