దివినుంచి భువికి దిగిన
సంగీత రసాధిదేవత
మనందరి కోసం
స్వరసామ్రాజ్యాన్ని
స్థాపించింది…
వసంతమై
ఎదల కొమ్మలకు
వేల పాటల ఆమని సొబగుల
మాధుర్యపు చిగుళ్లను తొడిగి
మళ్లీ దివికి వెళ్లిపోయింది…
అయినా
ఎన్నటికీ వాడిపోని
మనల్ని వీడిపోని
ఆమె గాత్రపరాగపు
పూల గుబాళింపుల్లో
మన హృదయాలు
వోలలాడుతూ
పులకిస్తూనే వుంటాయి…
ఒక జీవనదిలా
ఆమె పలికించిన
సరిగమల ప్రవాహం
సాగుతూనేవుంటుంది….
(వాణీ జయరాం స్మృతిలో)
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
తిరుపతి (ఆ.ప్ర). 9177732414 )




