రెక్కలు ముక్కలు
చేసుకోవాలి
చెమట బిందువులు
పారించాలి
బద్ధకం కంబలి విసిరేయాలి
శ్రమైక్య సౌందర్యం
అనుభవించాలి
కూలీనాలి దొరకనప్పుడు
ఫస్తులుండాలి
కుళాయి నీళ్ల కోసం
కొట్టుకు చావాలి
మురికి కూపంతో
సావాసం చేయాలి
పని పాటలు కోసం
ఎదురుచూడాలి
దినసరి భత్యం కోసం
దేవుళ్ళలాడాలి
ఎంత దూరమైన
పని కోసం వెళ్లి తీరాలి
ఎంతటి కష్టమైన
చేసి తీరాలి
మాయదారి
బ్రతుకులమ్మ వగచాలి
మానుదిటి రాతలు
ఇంతేనని సరిపెట్టుకోవాలి
గుప్పెడు మెతుకులు కోసం
వలస బాట పట్టాలి
-గాదిరాజు రంగరాజు
న్యూజెర్సీ,అమెరికా




