పరిగి ప్రజాతంత్ర జూలై 27: పరిగి నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా కొన్ని చోట్ల ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో వర్షాల కారణంగా గత రాత్రి గ్రామానికి చెందిన ఇందెల బాలమ్మకు చెందిన ఇల్లు కూలిపోవడం జరిగింది. అయితే ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఇల్లు కూలిపోవడంతో ఆర్థికంగా చాలా వరకు నష్టపోయామని కావున ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేశారు.



