ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కడ్తాల్ గ్రామపంచాయతీ కి చెందిన ముత్తి రామయ్య ఇల్లు రాత్రి కూలి పోయింది.. విషయం తెలుసుకున్న కడ్తాల్ గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించి సమస్యను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారిని ప్రభుత్వపరంగా ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు.



