ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : హుస్సేన్ సాగర్ లో వరద నీరు చేరినప్పటికీ గురువారం మాన్సూన్ రెగట్టా 2023 టీమ్ రేసింగ్ ఈవెంట్ విరామం లేకుండా నిర్వహించబడింది. జోరుగా కురుస్తున్న వర్షం, ప్రతికూల వాతావరణంను కూడా దేశంలోని సైలర్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ జ్యూరీ, చీఫ్ అంపైర్ కెప్టెన్ అభిమన్యు పాటంకర్, ముంబైలోని ఆర్మీ యాచింగ్ నోడ్‌కు చెందిన ప్రిన్సిపల్ రేస్ ఆఫీసర్ శ్రీకాంత్ చతుర్వేది మార్గదర్శకత్వంలో ఉత్సాహంగా ముందుకు సాగారు. సెయిలింగ్‌లో టీమ్ రేసింగ్ భారతదేశంలో 4 సంవత్సరాల తర్వాత మొదటిసారి నిర్వహించబడింది. నాలుగు రాష్ట్రాల తెలంగాణ, మధ్యప్రదేశ్, గోవా, మైసూర్ నుండి తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్, ఎన్ఎస్ఎస్ భోపాల్, నేవీ బాయ్ స్పోర్ట్స్ కంపెనీ, తృష్ణ సెయిలింగ్ క్లబ్ ప్రాతినిధ్యం వహిస్తున్న 6 రాష్ట్ర స్థాయి జట్లు పాల్గొన్నాయి.




