వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు టిడిపి నేతల ఘననివాళి

అమరావతి, జనవరి 18 : ఎన్టీఆర్‌ ‌వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి టీడీపీ నేతలు ఘనగంఆ నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయంలో టిడిపి అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. మహానటుడు, ప్రజానాయకుడిగా ఎన్టీఆర్‌ ‌చరిత్ర సృష్టించారన్నారు. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్‌ ఆద్యుడు అని పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలకు ఎన్టీఆర్‌ ‌సరికొత్త దిశా నిర్దేశర చేశారని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాలతో సమసమాజ స్థాపనకు ఎన్టీఆర్‌ ‌బాటలు వేశారన్నారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు మనందరం కృషి చేద్దామని చంద్రబాబు పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ ‌వర్ధంతి  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపి కేశినేని నాని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ‌ఖాన్‌  ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.మాచవరంలో ఎన్టీఆర్‌ ‌విగ్రహానికి ఎంపీ కేశినేని నాని పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయం చూసి అన్నగారు టీడీపీని స్థాపించారన్నారు. ఆనాడు పేదరికం చాలా ఎక్కువగా ఉందని.. అప్పటి పార్టీలు పేదలను వోట్ల బ్యాంకుగా భావించారన్నారు. కానీ ఎన్టీఆర్‌ ‌పేదలకు కూడు, గూడు, బట్ట అందించారన్నారు. కిలో బియ్యం రెండు రూపాయల పథకంతో పేదల కడుపు నింపారని కేశినేని నాని తెలిపారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లార న్నారు. అన్నదానం, రక్తదానం కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ భూమి ఉన్నంత కాలం ఎన్టీఆర్‌ ‌పేరు ఉంటుందన్నారు. ఎన్టీఆర్‌ ‌బాటలోనే చంద్రబాబు పేదలకు ఎన్నో చేశారని భవిష్యత్తులో కూడా చేస్తారన్నారు. పార్టీలో లుకలుకలపై మాట్లాడటానికి ఇప్పుడు సమయం కాదని కేశినేని నాని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *