దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం ప్రాథమిక హక్కులు అనే పదాలను రాజ్యాంగంలో లేకుండ చేయాలని ,మొత్తంగా రాజ్యాంగాన్ని మార్చాలని,అధ్యక్ష తరహా పాలన తీసుకొని రావాలని, ఈ దేశాన్ని మతప్రతిపాదికన పరిపాలించాలని, ముస్లిము క్రిస్టియన్,మైనార్టీ మతస్తుల పై విద్వేష రాజకీయాలను పెంచిపోషించే పని చేసింది,మరొక ప్రక్కన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రవేట్ రంగాన్ని బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నది,rss సిద్ధాంతానికి అనుగుణంగా దేశంలోని సకలసంపదలు,
పరిశ్రమలు,భూమి కొద్ది మంది దేశీయ పెట్టుబడిదారులకు అప్పగించే గట్టి ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా నల్లచట్టలను,అప్రకటిత నిర్భందన్ని,కొనసాగిస్తూ అర్థసైనికా బలగాలతో మధ్యబారతన్ని చుట్టుముట్టి అమాయకులైన ఆదివాసీలను,వారికి అండగా వున్న మావోయిస్టులను వందల,వేల మందిని చంపివేస్తున్నారు.
విద్యావంతులు,మేధావులు,సామజిక కార్యకర్తలను అర్బన్ నక్సల్స్ పేరుతో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు, పోటా వంటి అక్రమ కేసులను మోపుతున్నారు,అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చీల్చి అక్కడి ప్రభుత్వాలను తనగుప్పిట్లోకి తెచ్చుకున్నది,రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నించింది,NRC వంటి మత ప్రతిపాదిక విభజన అంశం ముందుకు తెచ్చింది,నోట్లు రద్దు చేయడం వల్ల పేద,మద్యతరగతి పజలు ఆర్దికంగా సామాజికంగా అనేక కష్టాలను ఎదుర్కొన్నారు, కరోనా వ్యాధి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లసరియిన వైద్యం దొరక అనేకమంది చనిపోయారు,ప్రతి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రామ మందిరం నిర్మాణం పేరుతో,జై శ్రీరామ్ నినాదం చెప్పించి అమాయక భక్తుల చెవిలో పులు పెట్టేవారు, దేశభక్తి అంటూ ప్రతి ఎన్నికల సందర్భంలో చైనా,పాకిస్తాన్,బంగ్లాదేశ్ సరిహద్దుల్లో యుద్దవాతవరం సృష్టించి అమాయక ప్రజల ఓట్లను కొల్లగొట్టేవారు, ఆహారపు అలవాట్లను,కట్టుబొట్టును నియంత్రించాలని మానసిక పోలీసింగ్ చేయం ఎక్కువైంది.ఇటువంటి దుర్మార్గుల నుండి, దురదృష్టం నుండి దేశ ప్రజలు విముక్తి కావాలని కోరుకున్నారు అనే మాట వాస్తవం.
2024 పార్లమెంట్ ఎన్నికల సంవత్సరం రానే వచ్చింది.
భారత దేశవ్యాప్తంగా ముడు దశల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ నాలుగు వందల సీట్లతో అధికారంలోకి రావాలని ఎన్నో కలలు కన్నది,ప్రతిపక్షంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలను అందించడానికి అన్నట్లు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలు దేశవ్యాప్తంగా భారత్ జోడొ యాత్ర పేరుతో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ను బలోపేతం చేశారు,విశాల ప్రాతిపదికన మిత్రపక్షన్ని ఐక్యం చేసి ఇండియా గా పోటీ చేశారు.గట్టి పోటీని ఇచ్చారు.ఫలితంగా బీజేపీ రెండు వందల ఇరవై సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది,తన మిత్రపక్షాల కూటమి పై ఆధారపడి ఎన్డీయే గా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సరిపోయే మెజారిటీ తో బయట పడ్డది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు, ఒరిస్సా నుండి నితీష్ కుమార్ లు కీలక భూమిక నిర్వహించే స్థితిలో ఉన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చాణక్యుడు గా పేరు తెచ్చుకున్న వ్యక్తి,ప్రపంచ బ్యాంకు CEO గా ప్రకటించుకున్న వ్యక్తి.ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు అయిన వాడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్ల అంశాన్ని ఎన్నికల ఎజెండాగా పోటీ చేసి ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కి మార్గ నిర్దేశకుడు గా వుండటం చూస్తుంటే దేశం పెనం మీద నుండి పోయ్ లో పడ్డట్లు అయింది అనిపిస్తుంది.ఇప్పటి వరకు మతోన్మాదం ఒక్కటే యుద్ధరంగంలో ప్రత్యక్షంగా వుండేది, సామ్రాజ్యవాదంతో (ఇక ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అదేశిత సరళీకృత ఆర్థిక విధానాల వేగవంతం)కూడ యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది.ప్రజలు,ప్రజాస్వామికవాదులు గమనించాల్సిన విషయం నేటి రాజకీయాల్లో తొలిసారిగా పార్లమెంటరీ పార్టీ కు ఎవరికి పూర్తి మెజార్టీ ఇవ్వకుండా ఎన్నికల ఫలితాలను ఇవ్వడం చూస్తుంటే ఈ దేశంలో మత రాజకీయాలను నిర్విద్ధంగా వ్యతిరేకించారని,అదే క్రమంలో ప్రతిపక్షాన్ని భుజం తట్టి నిలబెట్టినట్లు తీరు వెనక దేశ వ్యాప్తంగా బుద్ధిజీవులు, ఆలోచనాపరుల కృషి వెలకట్టలే నంత వున్నది.ఇది కొనసాగాలి.ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో బీజేపీ గెలవడానికి,లేదా అక్కడి ప్రజలు ఓట్లు వేయడానికి ప్రధాన కారణం అవిద్య,మూఢనమ్మకాలు, అంటరానితనం,కుల వివక్షత,ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేయడమే పరిష్కారం.
తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి సుదీర్ఘ పోరాటం అనంతరం 60 సంవత్సరాల తర్వాత అనేకమంది త్యాగాల ఫలితంగా భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి,కాళోజీ నారాయణరావు, బియ్యల జనార్ధన్,ప్రో కొత్తపల్లి జయశంకర్, బెల్లిలలిత, కనకాచారి,మరొజు.వీరన్న, శ్రీకాంతాచారి,పోలీసు కృష్టయ్య,ఇట్లా చెప్పుకుంటూ పోతే వేలాది అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం.
తెలంగాణ పోరాట అమరవీరుల ఆకాంక్షలునెరవెర్చే బాధ్యత మనందరి పైన ఉన్నది. ఒకరకంగా చెప్పాలంటే భౌగోళిక తెలంగాణ సాధ్యమైన అనంతరం మిగిలిపోయిన ప్రజాస్వామ్య, సామాజిక, తెలంగాణ లక్ష్యంగా మనందరం మరొక పోరాటానికి సిద్ధం కావలసినటువంటి తక్షణ అవసరం ఉన్నది. అదే క్రమంలో ఈ 60 సంవత్సరాల కాలంలోతెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన విధంగా గుర్తింపును ఇవ్వాల్సినటువంటి అవసరం వున్నది . తెలంగాణ సామాజిక క్షేత్రంలో ఉద్యమకారులకు తగిన గుర్తింపును,అవకాశాలను,భద్రతను,గౌరవాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్టి విషయమును ఎలుగెత్తి చాటాల్సినటువంటి బాధ్యత కూడ తెలంగాణ ఉద్యమకారులందరి పైన ఉన్నది కాబట్టి మరొక పోరాటానికి సిద్ధం కావలసినటువంటి తరుణం ఆసన్నమైందని మనం గ్రహించాలి,
నీళ్లు నిధులు నియామకాలు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీ గా ప్రస్థానం ప్రారంభించి ఫక్తూ రాజకీయ పార్టీగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అనేకమంది వ్యక్తులను తనలో కలుపుకొని తెలంగాణ వచ్చిన తదుపరి 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించింది, కానీ తన పది సంవత్సరాల పరిపాలనలో నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు తీరని నిరాశను,నిష్పృహను మిగిల్చింది , తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిర్లక్ష్యం చేసింది, తెలంగాణ ఉద్యమ కారులపై పెట్టిన కేసులను ఎత్తివేయలేదు, ఉద్యోగ,ఉపాద్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారం చేయలేదు,అవమనిచింది,మాటల్లో బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణ,నిరుద్యోగుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణగా మార్చింది,సామజిక న్యాయం,ఆత్మగౌరవం అంటే ఏమిటో అనే పద్ధతుల్లో పైపలించింది,ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు,తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత నిర్భంద వాతావరణాన్ని సృష్టించారు.
ఫలితంగా 2024 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు brs గా మారిన టిఆర్ఎస్ ను కాదని మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు,ప్రభుత్వ వ్యతిరేకత,విద్యావంతులు, మేధావులు,విద్యార్థుల సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది,ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిజాయితీ,నైతికత, పారదర్శకత పాటించాలి,నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ,ఉద్యోగ, ఉపాద్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారం,మహిళలు,రైతు,కూలీలు, అసంఘటిత కార్మికులు,చేతివృత్తుల వారికి తగిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి,ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచించే,మాట్లాడే అన్నిరకాల ప్రజా సంఘాల కు స్వేచ్చగా మాట్లాడే అవకాశం కల్పించడం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి,తక్షణమే పరిష్కరించడానికి తద్వారా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ను తగ్గించడానికి ప్రజా సంఘాలు సేఫ్టి వాల్వ్స్ గా ఉపయోగపడుతాయి అనే విషయాన్ని అధికారంలో వున్న రాజకీయ పార్టీలు గ్రహించాలి,ఇది తెలియకనే brs ఓడిపోయింది.
తెలంగాణ ఉద్యమకారులందరూ గత పోరాటాలను,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత గడచిన పది సంవత్సరాల కాలంను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమ పోరాట కాలంలోని లోపాలను సవరించుకొని నూతన ఉత్తేజంతో అమరుల ఆకాంక్షలను సాధించుకోవడానికి తెలంగాణ అమరుల త్యాగాల స్ఫూర్తిని అంది పుచ్చుకుని ప్రజాస్వామ్య, సామాజిక తెలంగాణ రాష్ట్రం సాధన దిశగా అడుగులు వేద్దాం.
బెజ్జంకి. ప్రభాకరాచారి.
రాష్ట్ర కమిటి సభ్యుడు
*తెలంగాణ విద్యావంతుల వేదిక*





