వర్గీకరణ తోనే భవిష్యత్తు.. మాదిగల హక్కులను హరిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం

పరిగి, ప్రజాతంత్ర, నవంబర్ 23: కులాల వర్గీకరణతోనే భవిష్యత్తు అని,వర్గీకరణకు మద్దతు తెలిపిన భాజపా పార్టీకి అందరూ మద్దతు పలకాలని  ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు.గురువారం  పరిగి నియోజకవర్గం లో  బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… భారత  ప్రధాని ఎస్సీ కులాల ఉప వర్గీకరణ కోసం మద్దతు తెలిపారని, కచ్చితంగా   ఉపకులాల వర్గీకరణ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక బహుజన బిడ్డకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెడతామని తెలియజేసిన సందర్భంలో ఓసి కులాల వారు మద్దతు తెలుపుతున్నారు, ఎస్సీ కులాల వారు మద్దతు తెలుపుతున్నారు కానీ బీసీ కులాలు  ఎందుకు మద్దతు తెలుపడం లేదని ప్రశ్నించారు. భాజపాకు కృతజ్ఞతగా మాదిగ సోదరీమణులందరూ  పరిగి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి  మారుతీ కిరణ్ కు  ఓటేసి గెలిపించాలన్నారు.అనంతరంబిజెపి అభ్యర్థి మారుతి కిరణ్  మాట్లాడుతూ …పరిగి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ పార్టీ ఇవ్వనటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ వెనుకబడిన  సామాజిక వర్గానికి చెందిన వాడిగా ఒక అవకాశం ఇచ్చింది.  నన్ను మీ ఇంటి బిడ్డగా, మన మాదిగ జాతి బిడ్డగా, మీ అందరి  బిడ్డగా, మీ ఇంట్లో ఒకడిగా నన్ను గుర్తించి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. గత 40 సంవత్సరాలుగా మాదిగ జాతి బిడ్డలు సామాజిక న్యాయానికి రిజర్వేషన్లలో  తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఒక్కసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ  అధికారంలోకి వచ్చిన తరువాత  ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అయ్యే విధంగా సహకరిస్తామని, నా మాదిగ అన్న తమ్ముళ్లకు అక్కచెల్లెళ్లకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని వారికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ నాయకులు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *