వరుసగా తొమ్మిదోసారి.. ఎరక్రోటపై జెండా ఎగరేయనున్న ప్రధాని మోడి

వజ్రోత్సవ వేళ జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

నూ దిల్లీ, ఆగస్టు14 : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, వరుసగా తొమ్మిదోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతదేశ స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా పంద్రాగస్టు వేడుక చాలా ముఖ్యమైనది. వేడుకల్లో ఉత్సాహాన్ని పెంచడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నది. ప్రంచంలోని చాలా ఇతర దేశాల మాదిరిగానే భారతదేశం కూడా కోవిడ్‌-19 ‌వంటి భయంకర పరిస్థితి నుండి బయటపడ్తున్న సమయంలో మనం ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం, కోవిడ్‌-19 ‌ప్రజల సాధారణ జీవితాలను అస్తవ్యస్తం చేసి ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీసింది.

ఇక స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం ‘హర్‌ ‌ఘర్‌ ‌తిరంగ’తో సహా అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. తన ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా కలిగిన ఫలితాలను హైలైట్‌ ‌చేయడానికి మోడీ తరచుగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొన్ని సార్లు మోడీ ముఖ్యమైన ప్రకటనలు చేశారు. గత సంవత్సరం ఆయన ప్రసంగం జాతీయ హైడ్రోజన్‌ ‌మిషన్‌, ‌గతి శక్తి మాస్టర్‌ ‌ప్లాన్‌, 75 ‌వారాల్లో 75 వందే భారత్‌ ‌రైళ్లను ప్రారంభించడం వంటి అనేక కార్యక్రమాలను మోడీ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *