వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 2: వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో బంగారు పథకం సాధించిన రంగారెడ్డి జిల్లా,కందుకూరు మండలం,బాచుపల్లి గ్రామానికి చెందిన మహేందర్ బంగారు పథకాన్ని సొంతం చేసుకుని ఔరా అనిపించాడు.దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 26 తేది నుండి 31 తేది వరకు జరిగిన వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2023,ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో నిర్వహించటం జరిగింది.డబ్ల్యుసిఎస్ఎ ప్రెసిడెంట్ గుస్తవ్ మల్ బర్గ్,అఫిషియల్ డైరెక్టర్ వాకెంట్ ఇండియాలో ఈపోటీలను నిర్వహించి ఇండియన్  క్రొబో షూటింగ్ ప్రెసిడెంట్ రజత విజ్,వైస్ ప్రెసిడెంట్ హిన విజ్లు ఈ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు.ఇందులో మొత్తం 7దేశాలు పాల్గొన్నాయి.ఆస్ట్రేలియా,రష్యా,ఇస్టోనియ, స్పిడన్,యుఎస్ఎ,పిల్లిపిన్స్,ఇండియాలు పాల్గొన్నాయి.ఇందులో ఇండియా నుండి 5 రాష్ట్రాలు పాల్గొన్నాయి.ఇండియాకు మొత్తం 38 పథకాలు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్ కు 7 పథకాలు 4 బంగారు పతకం,1 కాంస్యం,2 వెండి పతకాలు,తమిళనాడుకు 8 పతకాలు,3 బంగారు పతకాలు,4 కాస్య,1 వెండి పతకాలు,కేరళకు 1 బంగారు పతకం,1 కాంస్యం పతకం,1 వెండి పతకాలు,మహారాష్ట్రకు 2 బంగారు పతకాలు,తెలంగాణకు మొత్తం 18 పతకాలు వచ్చాయి.ఇందులో 10 బంగారు, 5 వెండి,3 కాంస్య పతకాలు సాధించింది. ఈ పోటీ్లో తెలంగాణకు చెందిన మలగల మహేందర్ బంగారు పతకం సాధించాడు. మహేందర్ రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలo, బాచుపల్లి గ్రామానికి చెందిన వారు మహేందర్ ప్రస్తుతం నల్గొండలోని శ్రీ కృష్ణ కళాశాలలో బీపీ ఈడి   చదువుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *