భీకర వర్షాల విలయానికి
తెలుగునేల కన్నీటి కడలైంది

భీభత్స వరదల తాకిడికి
జనజీవనం అస్తవ్యస్తమైంది

ఇపుడు
సర్వస్వం వర్షార్పణమై
రోదనలు మిన్నంటినయ్‌

‌పంట చేలు వరదమయమై
రైతు గుండెలు బోరుమన్నయ్‌

అం‌తటా పెను విషాదం
ఒడువని దుఃఖం మిగిలింది

ఈ విపత్కర పరిస్థితిలో
పాలకులపై భారం మోపి
మనం తప్పుకుంటే తగదు

మనుషులుగా అందరూ
స్పందించాల్సిన సందర్భం

బాధితులకు బాసటగా
నిలవాల్సిన సమయం

అన్నదాతలకు భరోసా
కల్పించాల్సిన తరుణం

అందుకే.. అందరం
ఉదాత్త రూపునెత్తుదాం

మసకబారిన బతుకుల్లో
ఉద్దీపన దీపం వెలిగిద్దాం

మోడుబారిన ఎదలో
నిబ్బర నదులు పారిద్దాం

సన్నగిల్లిన బతుకుల్లో
సరికొత్త ఊపిరిలు పోద్దాం

మూగబోయిన గళాల్లో
నవవసంత రాగం పలికిద్దాం
మానవవత్వాన్ని చాటుదాం

( గోదావరి వరద బాధితులకు బాసటగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *