తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వచ్చే రెండు నెలలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ ఎన్నికల్లో ప్రతిపక్షల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం తాండూరు నియోజకవర్గం లోని బషీరాబాద్ ఎన్నికల శంఖారావం సమావేశంలో మాట్లాడుతూ నా గడ్డ .. నేను పుట్టిన మండలం నుంచి ఈ ఎన్నికల రణభేరిని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, గత ఎన్నికలోనూ ఇదే గడ్డ లక్ష్మీనారాయణపూర్ లో ఏర్పాటు చేసుకొని విజయం సాధించాను. ఈ సారి కూడా ఇక్కడి నుంచే మీ లోకల్ బషీరాబాద్ బిడ్డ.. మీ అందరి జన ఆధరణ చూస్తుంటే.. నేను గెలిచిపోయాను అని చెబుతున్నా. ఐదేళ్ల కిందట ఒక్క అవకాశం ఇవ్వండి తాండూరు రూపురేఖలు మార్చి చూపిస్తా అన్నారు. అప్పుడు నేనిచ్చిన మాటను మీ బిడ్డ రోహిత్ రెడ్డి నిలబెట్టుకున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత ప్రభుత్వాలు మహిళలు, రైతులు, యువకులను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ప్రతీ ఒక్కరం ఉద్యమ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ నేడు గౌరవ ముఖ్యమంత్రి గారి సారధ్యంలో బంగారు తెలంగాణ దిశగా పయనిస్తుంది. సంక్షేమంలో ప్రపంచమే ఆశ్చర్యపో విధంగా ఎన్నో పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. కరోనా లాంటి సంక్షోభంలోనూ.. వెనకపడకుండా అండగా నలిచాము. రైతు సంతోషంగా ఉంటేనే మన గ్రామాలు, రాష్ట్రాలు, దేశం బాగుంటుందనే ఉద్దేశ్యంతో రైతుబంధు, రైతుభీమా, రైతు వేదికలు, రైతు రుణమాఫీ లాంటి పథకాలు తీసుకొచ్చి అన్నదాతలకు అండగా నిలిచిన ఘనత గౌరవ సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు.రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజ కేసీఆర్ గారు కొంటున్నారు. ఈ ఎన్నికల మేనిఫేస్టోలోనూ రైతులకు ప్రాధాన్యమిస్తూ.. రైతుబంధును రూ.10 వేల నుంచి దశలవారీగా రూ.16 వేలు చేశారు. నిరుపేద ప్రతీ కుటుంబానికి కూడా రూ.5 లక్షల కేసీఆర్ భీమా రానుంది. ఆసరా పెన్షన్లను.. 2 వేల నుంచి.. రూ.5 వేలు జేస్తుండు. వికలాంగులకు రూ.3 వేల నుంచి.. ఇప్పుడు 6 వేలు జేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మహిళలు అత్యవసరమైన గ్యాస్ సిలండర్ ధరను.. గౌరవ సీఎం కేసీఆర్ గారు.. రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు రూ.3 వేలు ప్రతీ నెల తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది.ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి..15 లక్షల వరకు పెంచుతున్నాం. ప్రమాదం జరిగితే ఏ ఒక్క రూపాయి మీ జేబు నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పట్నుంచీ రేషన్ లో సన్నబియ్యం ఇస్తాం. ఇప్పుడున్న పథకాలు ఇలాగే ఉండాలన్నా.. కొత్త మేనిఫేస్టోలోని అంశాలన్ని అమలు కావాలన్నా.. ప్రతీ ఒక్కరూ.. కారు గుర్తుకు గుద్దుడు గుద్దుతే బాక్సులు బద్దలు కావాలని, బషీరాబాద్ అభివృద్ధికి కోట్ల రూపాయలతో ప్రతీ గ్రామానికి రూ.50 లక్షలతో పల్లెల రూపు రేఖలు మార్చుకున్నాం. కాంగ్రెసోల్లకు క్యాండిడేట్ గతిలేక పక్క జిల్లా నుంచి తెచ్చుకుంటున్నారు. మన తాండూరు నియోజక వర్గంలొ ఎన్ని గ్రామాలున్నాయో వారికి తెలుసా. ఎప్పటికైనా.. ఇంటోడు ఇంటోడే.. బయటోడు బయటోడే. ఇలాంటోళ్లను తరిమికొట్టాలి. మరోసారి ఆశీర్వదించండి..బంపర్ మెజారిటీతో గెలిపించండి.. ఇంతకు మించి రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తా. అని తెలిపారు. ఈ శంఖారావ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీశైలం రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ సీనియర్ నాయకులు కర్ణ పురుషోత్తం రావు టిఆర్ఎస్ పార్టీ బషీరాబాద్ అధ్యక్షులు నర్సిరెడ్డి పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి అజయ్ ప్రసాద్ నాయకుల సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అబ్దుల్ రజాక్ శంకర్ రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే




