సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 28: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం… సంగారెడ్డి లో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని జగ్గారెడ్డి కూతురు జయా రెడ్డి కోరారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఈ 9 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పని చేసిందో మీరు చూశారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు 10 ఏళ్లు జగ్గారెడ్డి ఎలా పని చేశారో కుడా మీరు చూశారు కదా అని అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం లో చాలా మందికి అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బ్రతుకులు మారుతాయాన్ని అనుకున్నారు.కానీ ఎలాంటి మార్పు లేదు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అన్నారు.సంగారెడ్డి అంటే గుర్తింపు రావడానికి కారణం ఎవరు.. జగ్గారెడ్డి అని జగ్గారెడ్డి అంటే నే సంగారెడ్డి….సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అనే పేరు ఎలా వచ్చింది మంచిగా పని చేసిండు, అభివృద్ధి చేసిండు కాబట్టే వచ్చింది కదా అని పేర్కొన్నారు..ఒక ఐఐటీ,కలెక్టర్ ఆఫీస్, కోర్టు, పాలిటెక్నిక్ కాలేజీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది కదామెడికల్ కాలేజీ కొట్లాడి తీసుకొచ్చింది జగ్గారెడ్డి కదా అన్నారు. అందుకే జగ్గారెడ్డి ని మీరొకసారి గెలిపించాలని కోరారు.
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి లో జగ్గారెడ్డి ని గెలిపించండి




