లోభం ప్రలోభం – ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రలోభాల రాజ్యం
వాగ్దానాలతో  ఆర్థిక విధ్వంసం
ఎన్నికల వేళ  ఎడాపెడా హామీలు
హద్దుమీరిన తాయిలాల వర్షం
వాగ్దానాలన్నీ  నీటిమీద  రాతలుగా
అమలుకు నిధులెక్కడివని
అప్పుచేసి  పప్పుకూడు రీతిగా
ప్రజలపై పన్నుల భారం తో
దివాలాకోరు  ప్రభుత్వ విధానాలు
అప్పులతో  ఎన్నికల  తాయిలాలు
భూటకపు  వాగ్దానాలు .
కరెన్సీ నోట్లు వెదజల్లే ఆచారం
అధికారం కోసం ప్రలోభ మెనిపేస్టో
మానుకోవాలి అన్ని పార్టీలు
వాగ్దాన  కర్ణుల ఆట కట్టించాలి
వ్యవస్థాగత  ప్రక్షాళన   అవసరంగా
నిబద్ధతతో   పార్టీలుండాలి .
దేశంలో  బాధ్యతాయుతంగా
రాజకీయాలు నిలబడి తీరాలి
-డా. పులివర్తి కృష్ణమూర్తి
9949092761

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *