లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి

  • 24 నుంచి 26వ తేదీ వరకు 20వ బయో ఏషియా సదస్సు
  • తొలిసారి సదస్సులో పాల్గొంటున్న ఆపిల్‌ ‌కంపెనీ
  • వివరాలు వెల్లడించిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేసి..8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. బయో ఏషియా సదస్సు నేపథ్యంలో కేటీఆర్‌ ‌చిట్‌చాట్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌బయో ఏషియా ప్రాముఖ్యతతోపాటు జీవశాస్త్ర, ఫార్మా రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యలను వివరించారు.  బయో ఆసియా సదస్సు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కానుందన్నారు. తొలిసారి ఆపిల్‌ ‌కంపెనీ కూడా పాల్గొంటుందని కేటీఆర్‌ ‌ప్రకటించారు. ఇప్పటి వరకు 19 సదస్సులు జరిగాయని, ఈ సారి ప్రతిష్టాత్మకంగా 20వ సదస్సు నిర్వహించుకోబోతున్నామన్నారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు సదస్సు కొనసాగుతుందని, ‘అడ్వాన్సింగ్‌ ‌ఫర్‌ ‌వన్‌ : ‌షషేపిగ్‌ ‌నెక్టస్ ‌జనరేషన్‌ ‌హ్యూమనైజ్డ్ ‌హెల్త్‌కేర్‌’ అన్న ఇతివృత్తంతో 20వ బయో ఏషియా సదస్సు జరుగుతుందన్నారు.

గత 19 సంవత్సరాల్లో 24 వేలకోట్ల పెట్టుబడులను బయో ఏషియా రాష్ట్రానికి తీసుకువొచ్చిందని, ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో వొచ్చిన పెట్టుబడులు కొన్ని ఆంధప్రదేశ్‌కు వెళ్లాయన్నారు. భారతదేశ లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగానికి బయో ఏషియా విస్తృతమైన సేవలను అందించిందన్నారు. దేశ లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధించిందని కేటీఆర్‌  అన్నారు. వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్‌ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగామని, 20వేలకు పైగా భాగస్వామ్య చర్చలు , 30 పాలసీ పేపర్లు, సిఫార్సులను ఈ సదస్సు అందించిందన్నారు. 100 దేశాలు ఇప్పటిదాకా ఈ సదస్సులో పాల్గొన్నాయని తెలిపారు. గత 20 సంవత్సరాలలో 250కి పైగా అవగాహన ఒప్పందాలను, ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ఈ సదస్సు భాగస్వామిగా ఉందన్నారు. ఇప్పటికే అనేక దేశాలు భాగస్వామ్య కంట్రీల హోదాలో ఏషియాలో పాల్గొన్నాయన్నారు.

ఈసారి కూడా పలు దేశాలు బయో ఏషియాతో భాగస్వామ్య దేశం హోదాలో పాల్గొంటున్నాయని తెలిపారు. లైఫె సైన్సెన్‌ ‌రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీ, మెడికల్‌ ‌డివైసెస్‌ ‌పార్క్, ‌బయో ఆసియాతో పాటు అనేక ఇతర ప్రయత్నాలు చేస్తుందని కేటీఆర్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం విలువ, ఉద్యోగాలు కూడా 2028 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యమని, 2021లో హైదరాబాద్‌ ‌దాని పరిసరాల్లోని జీవశాస్త్ర రంగ కంపెనీల ఏకో సిస్టమ్‌ ‌విలువ 50 బిలియన్‌ ‌డాలర్లు ఉండగా.. 2028 నాటికి దీన్ని వంద బిలియన్‌ ‌డాలర్లకు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అదే సమయంలో ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న 4 లక్షల ఉద్యోగాలను 8లక్షలకు పెంచుతామన్నారు. భవిష్యత్తులో కొరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీ ఉండబోతుందన్నారు. జీవశాస్త్ర రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఫార్మాసిటీ ఏర్పాటుతో మరింత ఎత్తుకు ఎదుగుతుందని కేటీఆర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *