లిక్కర్‌ ‌స్కాం కేసులో సిసోడియాకు 6వరకు సిబిఐ కస్టడీ

న్యూదిల్లీ,మార్చి4:  లిక్కర్‌ ‌స్కాం కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్‌ ‌పిటిషన్‌పై విచారణను మార్చి 10కి న్యాయస్థానం వాయిదా వేసింది. అలాగే సిబిఐ కస్టడీని కూడా మరో మూడురోజుపాటు పొడిగించింది. మార్చి 6వరకు సిసోడియా సిబిఐ కస్టడీలో ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. ఇక సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్‌ ‌కార్యకర్తలు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో సిసోడియాను కోర్టుకు తరలించేందుకు సిబిఐ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతల నడుమ శనివారం మధ్యాహ్నం సిసోడియాను సిబిఐ అధికారులు కోర్టుకు హాజరు పరిచారు. ఈ పిటిషన్‌పైనా కోర్టులో శనివారం వాదనలు జరిగాయి. కస్టడీలో ఉంచితే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ కేసుకు సంబంధించి సిబిఐ అన్నింటినీ స్వాధీనం చేసుకుందని, అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని సిసోడియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో మనీష్‌ ‌సిసోడియా కస్టడీని మరో రెండు రోజుల పాటు రౌస్‌ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. దీంతో ఈనెల 6వ తేదీ వరకూ సిసోడియా సీబీఐ కస్టడీలోనే కొనసాగుతారు. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కూడా కోర్టు ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. సిసోడియా బెయిల్‌ అభ్యర్థనపై సీబీఐకి కోర్టు నోటీసులు పంపింది. ఎక్సైజ్‌ ‌పాలసీ కుంభకోణంలో సీబీఐ 5 రోజుల కస్టోడియల్‌ ‌రిమాండ్‌ ‌శనివారంతో ముగియనుండటంతో ఆయనను భారీ భద్రత మధ్య కోర్టు ముందు హాజరుపరిచారు.ఈ సందర్భంగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్ ‌ముందు ఢిల్లీ పోలీసులు, రాపిడ్‌ ‌యాక్షన్‌ ‌ఫోర్స్, ‌సీఆర్‌పీఎఫ్‌ను మోహరించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయనను కోర్టుకు తీసుకురాగా, మరో మూడు రోజుల సీబీఐ కస్టడీని కోర్టు కోరింది. కస్టడీ పొడిగించాల ని సీబీఐ కోరడం సరికాదని సిసోడియా తరఫు సీనియర్‌ ‌న్యాయవాది దయన్‌ ‌కృష్ణన్‌ ‌వాదించారు.

సీబీఐ 9 నుంచి 10 గంటల సేపు సిసిడియాను కూర్చోపెట్టి, అడిగిందే పదేపదే అడుగుతూ వచ్చిందని, ఇది మానసికంగా వేధించడమేనని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి ముందు, ఎక్సైజ్‌ ‌పాలసీ కుంభకోణం కోసులో విచారణకు సిసోడియా సహకరించడం లేదని సీబీఐ ఆరోపించింది. సిసోడియా కార్యాలయం నుంచి గత జనవరిలో ఒక కంప్యూటర్‌ను సీజ్‌ ‌చేశామని, ఆ కంప్యూటర్‌ ‌నుంచి్గ ళ్లు, ఇతర డాటా తొలగించినట్టు కనుగొన్నామని సీబీఐ వర్గాలు తెలిపాయి. తొలగించిన ్గ•ళ్లైను రిట్రైవ్‌ ‌చేసేందుకు ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌కు పంపామని, కంప్యూటర్‌ ‌నుంచి డిలీట్‌ ‌చేసిన మొత్తం ఫైల్‌ను రిట్రైవ్‌ ‌చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన నివేదికను ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఇచ్చిట్టు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.సీబీఐ ఎప్పుడు విచారణకు పిలిచినా తాను హాజరయ్యేందుకు సిద్ధమని సిసోడియా తెలిపారు. ఈ కేసులో సీబీఐ స్వాధీనం చేసుకున్నవన్నీ ఆ ఏజెన్సీ దగ్గరే ఉన్నందున తనను కస్టడీలో ఉంచడం వల్ల ఎలాటి ప్రయోజనం ఉండదని బెయిల్‌ ‌పిటిషన్‌లో సిసిడియా పేర్కొన్నారు. ఈ కేసులో ఇంతవరకూ ఏడుగురిపై సీబీఐ ఛార్జిషీటు నమోదు చేసింది. అనుబంధ ఛార్జిషీటును కూడా సిద్ధం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *