లిక్కర్‌ ‌కేసులో అప్రూవర్‌గా దినేశ్‌ అరోరా

న్యూ దిల్లీ, నవంబర్‌ 7 : ‌లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అప్రూవర్‌ ‌గా మారిన నిందితుడు దినేష్‌ అరోరాను సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. అతడిని సాక్షిగా పరిగణించాలంటూ కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ అంశం చాలా సున్నితమైంది కాబట్టి డియాను కోర్టులోకి అనుమతించొద్దని నిందితుడు దినేష్‌ అరోరా తరపు న్యాయవాది ఆర్‌.‌పి ఠాగూర్‌ ‌కోర్టును కోరారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని..

అప్రూవర్‌ ‌గా మారానని సీబీఐ న్యాయమూర్తి ఎం కె నాగ్‌పాల్‌ ‌ముందు నిందితుడు చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని న్యాయమూర్తి ముందు దినేష్‌ అరోరా వాంగ్మూలం ఇచ్చారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *