ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్టిక్ 320A వారి ఆధ్వర్యంలో 2022-2023 వ సంవత్సరానికి గాను అవార్డు ‘గేలా’ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ లోని కె.వి.ఆర్ కన్వెక్షన్ లో జరిగింది. ఈ అవార్డు ‘గేలా’లో లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లు కు అవార్డులు లభించాయి. మాజీ గవర్నర్ జి చెన్నకిషన్ రెడ్డి మల్టిపుల్ 320 లో ఆయన చేసిన గుర్తింపు గాను కంటి చూపు లేని వారికీ ఉచితంగా ఆపరేషన్ చేయించి కడ్తాల్ లోని కంటి అస్పత్రికి అండగా ఉంటూ మల్టిపుల్ 320లో ఉన్న జిల్లాలోని గవర్నర్లతో సక్యత గా ఉంటూ విజన్ లీడర్ గా గుర్తించి మల్టీబుల్ అవార్డుతో ఆయనను సత్కరించింది. మల్టిపుల్ రీజియన్ చెర్మన్గా భావండ్ల వెంకటేష్, ఉత్తమ మల్టిపుల్ అధ్యక్షునిగా బైరి కరుణాకర్ రెడ్డి అతి ఉత్తమ పిఆర్ఓగా ఎంఏ పాషా అవార్డులు లభించినట్లు క్లబ్ పిఆర్ఓ పాషా తెలిపారుఈ. అవార్డులను మల్టిపుల్ చైర్మన్ లయన్ ఎమ్ విద్యాసాగర్ రెడ్డి, ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ జి. బాబురావు చేతుల మీదుగా అందుకున్నట్లు పాష తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టిపుల్ చైర్మన్ లయన్స్ ఎం విద్యాసాగర్ రెడ్డి, ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ బాబురావు, మాజీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్, ఎల్ సి ఎఫ్ ఏరియా లీడర్ ఎస్ నరేందర్ రెడ్డి, ఎల్ సి ఎఫ్ కో ఆర్డినేటర్ జి చెన్నకిషన్ రెడ్డి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరి రఘు, గవర్నర్ హరి నారాయణ బట్టడ్, ఎలక్ట్రి గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి, కోటేశ్వరరావు, మాజీ గవర్నర్ రాధాకృష్ణ అవార్డు గ్రహీతలు, వివిధ జిల్లా గవర్నర్లు వైస్ గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు



