ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ ఆధ్వర్యంలో కల్వకుర్తి ప్రశాంత్ నర్సింగ్ హోమ్ ఆవరణలో ఈనెల 8న మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందంచే ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ పిఆర్ఓ పాషా, క్యాంపు చైర్మన్ పి. వెంకట్ రెడ్డి తెలిపారు. అవసరమైన వారికి ఈసీజీ, టు డి ఈకో పరీక్షలు ఉచితంగా చేయబడును అని క్యాంప్ చైర్మన్ వెంకటరెడ్డి, పిఆర్ఓ పాషా పేర్కొన్నారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ వి. దామోదర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8ని లయన్స్ క్లబ్ సభ్యులందరం పండుగలా జరుపుకుంటామని క్లబ్ పిఆర్ఓ తెలిపారు. సేవా కార్యక్రమాలలో భాగంగా కల్వకుర్తి లయన్స్ భవన్ సేవా కేంద్రంలో మరియు మాడన్ డిగ్రీ కాలేజీలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు క్యాంపు చైర్మన్ భైరి. కరుణాకర్ రెడ్డి, భావండ్ల వెంకటేష్, పిఆర్ఓ పాషా పేర్కొన్నారు. అదేవిధంగా లయన్ సేవా కేంద్రం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కల్వకుర్తి లయన్ మధుమోహ పరీక్ష కేంద్రంలో లయన్ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా మధుమేహ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. లయన్ సేవా కేంద్రంలో లయన్స్ క్లబ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సభ్యులందరూ విధిగా హాజరై విజయవంతం చేయాలని తెలిపారు.




