జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: గజ్వెల్ నియోజకవర్గంలో నూతనoగా నిర్మించిన మత, శిశు హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు బిసి బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి హరీష్ రావు, జడ్పీటీసీ వంటేరు సుధాకర్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి,పాక్స్ చైర్మన్ ఆలేటి ఇంద్రాసేన రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ …ముఖ్యమంత్రి కెసిఆర్ సబ్బండ వర్గాలకు ఆపద్బాంధవుడుగా బిసి లకు బిసి బంధు, అక్కచెల్లమ్మలకు కేసీఆర్ కిట్ , దళితులకు పెద్దన్నగా దేశంలోనే ఎక్కడ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆసరా పెన్షలు, బీడీ కార్మికులకు బీడీల పెన్షన్, ముదిరాజ్ లకు మత్స్యకారులకు చేపల పెంపకం, రైతులకు రైతు బంధు, రైతు బీమా,సబ్బండ వర్గాలకు పెద్దన్నగా ఉండి తెలంగాణ లో ప్రతి గడపగపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయాని అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ బీ ఆర్ యస్ అధ్యక్షులు జూపల్లి మధు, కొండపోచమ్మ డైరెక్టర్ ముక్కెర గీత నాగరాజు,మాజీ బీ ఆర్ యస్ అధ్యక్షులు కె. నారాయణ,జూపల్లి రామస్వామి,ఆకారం పెద్ద నర్సీంలు,ముక్కెర రాములు జూపల్లి భాస్కర్, పబ్బ బాల్ నర్సాగౌడ్, నాగమణి, గోపాల్, బాల్ నర్సింలు,బ్రహ్మ చారి మంగలి మహేష్, చాకలి మల్లేశం, పోతారాజు సత్యనారాయణ, దెశెట్టి ఎల్లo, అనేమైన బాలరాజు, బీ ఆర్ యస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు బిసి బంధు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ



