- వెంటనే రైతుల భూ సమస్యలను తీరుస్తూ ధరణి పోర్టల్ రద్దు చేయాలి
- పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 70 శాతం అని అబద్ధం చెపుతున్నారు
- టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రధానమైనటువంటి రైతు రుణమాఫీ ఇప్పటివరకు మాఫీ చేయలేదని కల్లబొల్లి మాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని రైతాంగాన్ని తీరని మోసం గురి చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ కు రైతు సమస్యలు పరిష్కరించి ధరణి పోర్టల్ ఎత్తివేయాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఏ ఒక్క ఆమెను కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. రైతులకు ఏకకాలంలో లక్ష రుణమాఫీ ఇస్తానని ఇవ్వకుండా రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటూ అబద్దపు మాటలతో రైతాంగాన్ని తీరని మోసానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు బతికి ఉన్నప్పుడు లబ్ధి చేయకుండా చనిపోయాక రైతు బీమా చెల్లిస్తున్నామని రైతులు చనిపోతే కానీ రైతులకు న్యాయం చేయారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండానే 70 శాతం పనులు పూర్తయిపోయాయి అని సీఎం కేసీఆర్ మాట్లాడడం సరైనది కాదని పనులే ప్రారంభించలేదని అబద్ధపు మాటలు చెప్తే సీఎం కేసీఆర్ చంద్రశేఖర రావు మూతి పళ్ళు రాలగొడతానని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
రైతులకు న్యాయం చేయకపోయినా పరవాలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా రైతాంగానికి అన్యాయం చేస్తూ రైతు సమస్యలను పరిష్కరించకుండా ధరణి పోర్టల్తో లేని సమస్యలను సృష్టించి తెలంగాణ రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనను సాగిస్తున్న నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని తెలిపారు. తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇప్పటికే టీఆర్‌ఎస్ కు అమ్ముడు పోయినావు మళ్లీ నిన్ను ఎవరు కొనుగోలు చేస్తావు సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశావు ఇప్పుడు నీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని శుద్దపూస మాటలు చెబుతున్నావు ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై కాంగ్రెస్ను చిన్నభిన్నం చేయాలని దుర్బుద్ధితో కుటీలయత్నంతో ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజానీకం అన్నింటినీ గమనిస్తుంది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగి అభివృద్ధి దిశగా సాగేందుకు అవకాశం ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఎన్నికలలో దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మోసపూరిత ప్రకటనలతో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని తీయబట్టారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ మాజీ పిఎసిఎస్ చైర్మన్ కిషన్ నాయక్ మాజీ జెడ్పిటిసి రాములు వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు
రైతాంగ సమస్యలపై కదిలిన శ్రేణులు
పిసిసి చీఫ్ రేవంత్ పిలుపుతో కలెక్టరేట్ల ముట్టడి
రైతాంగ సమస్యలపై కదిలిన శ్రేణులు
పిసిసి చీఫ్ రేవంత్ పిలుపుతో కలెక్టరేట్ల ముట్టడి
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెం
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పాల్గొన్నారు. రగుడు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. పాదయాత్రతో కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు యత్నించడంతో.. పోలీసులు వారికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. బారికేడ్లు అడ్డుపెట్టి నిరసనకారుల్ని అడ్డుకున్నారు.
దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బారీకేడ్లను దాటి కలెక్టరేట్ లోకి వెళేందుకు యత్నించారు. పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రణి పోర్టల్ రద్దు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని.. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అంటున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్?లోకి వెళ్తేందుకు యత్నించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోవైపు హన్మకొండ జిల్లా ఏకశిలా పార్క్, బాలసముద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. రైతు, వ్యవసాయ భూమి సమస్యలపై ధర్నాకు దిగారు. ఈ నిరసనలో ••ల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎంపి రాజయ్ పాల్గొన్నారు.




