లక్ష్మీ ప్రసన్నకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి రామ్మోహన్ గౌడ్

వనస్థలిపురం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:మహిళా సాధికారిత కోసం కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ ముద్ద గౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ కే ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని, మాజీ కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగావ్ని రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ రేఖా నాయక్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్ గౌడ్, సామ రమణారెడ్డి, జిన్నారం విట్టల్ రెడ్డిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులు అరాచకాలు చేస్తూ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం బలపరుస్తూ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ఉంటే సుధీర్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తూ పోలీస్ కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుని లక్ష్మీప్రసన్నకు టికెట్ కేటాయించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *