మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 29: పోలీసుల చేతిలో గాయపడిన లక్ష్మి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు, మాజీ ఏమ్మెల్సి రాములు నాయక్ హామీ ఇచ్చారు. పోలీసుల చేతిలో గాయపడిన లక్ష్మి కుటుంబాన్ని మంగళవారం కాంగ్రెస్ నాయకులు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ అల్మాస్ గూడాలోని నివాసంలో లక్ష్మిని పరామర్శించి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరుపున రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ.. గిరిజన మహిళపై ఇంత దారుణానికి పోలీసులు ఒడిగట్టడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, దేపా భాస్కర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, సరికొండ మల్లేష్, ప్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, చల్లా బాల్ రెడ్డి, మౌనిక, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, కందుకూరు మండల అధ్యక్షుడు కృష్ణ నాయక్, కార్పొరేషన్ మహిళ అధ్యక్షురాలు అమృత నాయుడు, నాయకులు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, నవారు మల్లారెడ్డి, సామ భాస్కర్ రెడ్డి, ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.



