కారణాలు తెలపకపోవడంతో ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 8 గంటల ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉదయ 6 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం 11.45 వెళ్తుందని అధికారులు ప్రకటన చేయడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. ఇప్పటి వరకు ఎప్పుడు బయలుదేరుతుందో కూడా ఎయిర్ ఇండియా సిబ్బంది క్లారిటీ ఇవ్వలేదని వారు ఆరోపించారు. దీంతో ప్రయాణికులకు, సిబ్బందికి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది.



