వరంగల్లోని శివనగర్ కు చెందిన రౌడీషీటర్ నజీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ చెందిన నలుగురు ఇనుప రాడ్లతో తలపై కొట్టడంతో రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. వరంగల్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ ఫారం వైపు ఉన్న బార్ షాప్ వద్ద మంగళవారం అర్ధరాత్రి నజీర్ ను కొట్టి చంపారు. నజీర్ చనిపోయాడని నిర్ధారించుకొన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు పారి పోయారు. అర్ధరాత్రి పన్నెండున్నార ప్రాంతంలో మద్యం మత్తులో ప్రారంభమైన గొడవ పెరిగి పెద్దదిగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. బతుకు దేరువు కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్ చెందిన వారికి ట్రైన్స్ లో కీ చైన్స్ లాంటి చిరు వ్యాపార నిమిత్తం నజీర్ డబ్బులను అప్పుగా ఇస్తూ వసూళ్లు చేసుకొంటారు. కొంతకాలం నుండి డబ్బులివ్వకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని మంగళవారం రాత్రి పట్టుకొని నిలదీయడంతో మాటమాట పెరిగి హత్యకు దారితీసిన్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మిల్స్ కాలనీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



