రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి

వాషింగ్టన్‌, ‌సెప్టెంబర్‌ 13: అమెరికాలో చదువు తున్న భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్‌ ‌వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆం•్ర ప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల జాహ్నవి ఈ ప్రమాదంలో మరణిం చింది. నార్త్ఈస్టర్న్ ‌యూని వర్సి టీలోని సీటల్‌ ‌క్యాంపస్‌లో మాస్టర్స్ ‌ఢిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మరణం పట్ల ఒక పోలీస్‌ అధికారి చాలా చులకనగా, హేళనగా మాట్లాడాడు. ఆమె ప్రాణాలకు విలువలేదని సీటెల్‌ ‌పోలీస్‌ అధికారి డేనియల్‌ ఆడెరర్‌ ‌తన సహోద్యోగితో అన్నాడు. డేనియల్‌ ‌నవ్వుతూ.. ‘ఆమె చనిపోయింది. సాధారణ వ్యక్తి’ అని తెలిపాడు.

అలాగే మళ్లీ నవ్వుతూ.. ‘ఒక చెక్‌ ‌రాయండి. పదకొండు వేల డాలర్లకు’ అని చెప్పాడు. ఆమె వయసు 26 ఏండ్లని, ఆమె ప్రాణాలకు విలువ లేదని నవ్వుతూ అన్నాడు. కాగా, పోలీస్‌ అధికారి డేనియల్‌ ఆడెరర్‌ ‌మరో పోలీస్‌ అధికారితో ఫోన్‌లో మాట్లాడిన ఈ సంభాషణ అతడిబాడీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఆడియో క్లిప్‌ను సీటెల్‌ ‌పోలీస్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌సోమవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇది వైరల్‌ ‌కావడంతో పోలీస్‌ అధికారి డేనియల్‌ ‌తీరుపై విమర్శలు వెల్లు వెత్తాయి.ఈ సంఘటనపై కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఆ పోలీస్‌ అధికారిపై చర్యలకు డిమాండ్‌ ‌చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు సీటెల్‌ ‌పోలీస్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *