మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: తుక్కుగూడ పురపాలక పరిధిలోని సర్దార్ నగర్- రావిర్యాల మధ్యన వెలసిన శ్రీసూర్యగిరి రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం మహేశ్వరం ఎమ్మెల్యేసబితారెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ట్రస్టీచైర్మన్ రెడ్డిగల్ల రత్నం, తోపాటు కౌన్సిలర్ సుమన్, బుచ్చిరెడ్డి, లక్ష్మయ్య, విష్ణువర్ధన్రెడ్డిలు ఆమెకు స్వాగతం పలికారు. పూజ కార్యక్రమం అనంతరం ఆమె తుక్కుగూడ వైపుకు వస్తుండగా ఓ వ్యక్తి ఫిడ్స్ వచ్చి రోడ్డుపై పడి ఉండగా గమనించిన సబితమ్మ తమ వాహనాన్ని వెనక్కి మళ్లించి స్వయంగా తాను కారు
దిగి అతన్ని పరామర్శించారు. తన సిబ్బంది సహాయంతో అతను మామూలు స్థితిలోకి వచ్చేలా చేసిన అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన గ్రామం అమనగల్ అని పేరు
ఎల్లయ్యగా పేర్కొన్నారు. కొంత నగదు ఇచ్చి అతన్ని ఆటో ఎక్కించి అమనగల్కు పంపారు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి సబితమ్మకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంటికి వెళ్లారు.
రోడ్డు పక్కన అస్వస్థతతో పడి ఉన్న బాటసారికి చేయూతనిచ్చిన ఎమ్మెల్యే సబితారెడ్డి




