రోడ్డుపై ఏరులైపారుతున్న మురుగునీరు..పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 13 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 11వ వార్డు ఆదర్శ నగర్ కాలనీలో నివాస గృహాల ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండిపోయి మురికినీరు ఏరులై పారుతున్న పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇటీవలనే నూతనంగా సిసి రోడ్డును వేశారు. వేసిన కొద్ది రోజుల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండిపోయి మ్యాన్ హోల్ నుంచి మురికి నీరు ఏరులై పారుతుంది.. ఈ విషయమై కాలనీవాసులు ఎన్ని మార్లు మున్సిపల్ వార్డు అధికారి, సిబ్బందికి తెలియజేసిన పట్టించుకోవడం లేదన్నారు. సమస్య ఇలానే ఉంటే దోమలు పెరిగి కాలనీవాసులు అనారోగ్యాల బారిన పడతారని వాపోయారు. మున్సిపల్ చైర్మన్ ఇంటి సమీపంలో ఇలా ఉంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. మురికి నీరు ఏరులై పారుతుండడంతో దుర్వాసన వెదజల్లుతుందని వెంటనే సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. పై విషయమై ఆ వార్డు కౌన్సిలర్ బైకని యాదమ్మ శ్రీశైలం యాదవ్ ను ప్రజాతంత్ర విలేకరి సంప్రదించగా ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కరించడం లేదని ఆమె తెలిపారు. త్వరలోనే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని యాదమ్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *