హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రైతు రుణమాఫీ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిధుల సవి•కరణకు చర్యలు ప్రారంభించగా..తాజాగా కటాఫ్ చర్యలపైన ఒక నిర్ణయానికి వొచ్చినట్లు తెలుస్తుంది.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు రుణాలు తీసుకున్న రైతులకు రూ. 2 లక్షల చొప్పున మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కటాఫ్ చర్య ప్రకారం రుణమాఫీకి దాదాపు రూ. 35 వేల కోట్ల మేర నిధులు అవసరమవుతాయని కూడా అంచనాకు వొచ్చినట్లు సమాచారం.





