వనస్థలిపురం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులు తీసుకున్న పంట రుణాలను ఒక లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని ప్రకటించడంతో శుక్రవారం ఉదయం బి ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ,కొత్తపేట మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, చంపాపేట మాజీ కార్పొరేటర్ సామ రమణా రెడ్డి చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తుల రాంబాబు ముఖ్య అతిధులుగా పాల్గొని రైతు బజార్ లోని రైతులతో కలిసి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తదుపరి రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే రైతులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వర్యులు శ్కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులు తీసుకున్న పంట రుణాలను ఒక లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని ప్రకటించడంతో దీని వలన 29. 61 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరేవిధంగా సుమారుగా 19 వేల కోట్ల రూపాయలు మేరకు మాఫీ అవుతున్నాయని , అకాల వర్షాలతో రైతులు పంటలు సరిగా నష్టపోతుండటంతో రుణమాఫీ చేయడం హర్షణీయమని, ఇప్పటికే ప్రభుత్వం ఉచిత విద్యుత్, దళిత బందు, మైనారిటీలకు మరియు బి సి లకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం, కల్యాణ లక్ష్మీ , షాదీముబారక్ వంటి పథకాలు పేదలకు అందుతున్నాయని , మన సి యం గారు రైతుల పక్షపాతి అని, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు చంద్రయ్య , శ్రీనివాస రెడ్డి , ఉదయ్ రెడ్డి , లింగమ్మ , అనిత , ఉపేందర్ రెడ్డి , యాదమ్మ , నగేష్ BRS పార్టీ నాయకులు నక్క వెంకట స్వామి యాదవ్, మెట్టు వెంకట్ రెడ్డి , పవన్, గట్టు శ్రీనివాస్ , మహ్మద్ , నాగరాజు గౌడ్, చంద్రకాంత్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, రమణా రెడ్డి , తిరుమల రెడ్డి , యాది ముదిరాజ్, సంతోష్ గౌడ్ , కోటేష్, జువ్వగాని రాజు గౌడ్, కృష్ణ గుప్తా, రామ లక్ష్మణ్, సిలుమర్తి శేఖర్ , పారంద స్వామి , అంజి రెడ్డి, హరి గౌడ్, వెంకటేష్ , ప్రవీణ్ గౌడ్ , రమణ గౌడ్, శ్రీధర్ , వెంకటేష్ గౌడ్ , రవి చందర్ , అంజయ్య , శ్రీను, సామ సాయి , శాండీ , భాను , అభి, గుమ్మడివెళ్లి సాయి కిరణ్, పార్వతి, స్వప్న , హరి ప్రసాద్ , రమణ , నాగరాజు ముదిరాజ్, హరి గౌడ్, కావేటి రాజశేఖర్ , నరసింహా గౌడ్ , జగన్ , వెంకట్ , ఆఫ్రిద్ , సమీర్ , సునీల్, సన్నీ , విజయ , రామ లక్ష్మి , శశికళ, లీలావతి , ప్రసన్న , నాగలక్ష్మి , కళ్యాణి తదితరులున్నారు.




