రైతు పక్షపాతి సీఎం కేసీఆర్.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ రైతుల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ ని పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో  రైతు రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి  కేసీఆర్  చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఏ సందర్భంలో ఏం కావాలో ముఖ్యమంత్రి  కేసీఆర్ కు తెలుసని తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారన్నారు. ప్రతిపక్షాల ప్రగల్బాల మాటలు నమ్మరాదని, వాళ్ళు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లాంటి రైతు సంక్షేమ విధానాలను అమలు చేయడంలేదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ దొడ్ల రాంరెడ్డి బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు బూరుగుపల్లి అనంతరెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి కౌన్సిలర్లు గోపాల్ అనంత్ రెడ్డి దారూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి  ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *