రైతు ద్రోహి కేసీఆర్‌..!

  • ఇది రాష్ట్ర ప్రజల సొమ్ము…కేసీఆర్‌ ‌తాత జాగిరు కాదు..
  • కౌలు రైతుకు నయా పైసా ఇవ్వడు కానీ..పంజాబ్‌, ‌హర్యానా రైతులకు పైసలు వంచుతడు
  • ఒక చేత రైతుబంధు ఇచ్చి మరో చేత సబ్సిడీలు దొబ్బేసిండు
  • 1.25 లక్షల పీఎం కిసాన్‌ ‌సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం
  • ఒక్క రోజే 18 వేల కోట్లు రైతుల అకౌంట్లో జమ
  • కేంద్ర నుంచి రంగారెడ్డి జిల్లాకు 422 కోట్ల నిధులు
  • బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌
షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో కౌలు రైతులకు నయా పైసా న్యాయం చేయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన తాత జాగీరులా రాష్ట్ర ప్రజల సొమ్మును పంజాబ్‌, ‌హర్యానా రైతులకు అప్పనంగా పంచుతున్నాడంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి మోదీ 1.25 లక్షల పీఎం కిసాన్‌ ‌సమృద్ధి కేంద్రాలను గురు వారం జాతికి అంకితం చేయనున్న కార్యక్రమాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా షాద్‌ ‌నగర్‌ ‌పట్టణంలో గణేశ్‌ ఆ‌గ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణంలో ప్రధాని మోదీ డిజిటల్‌ ‌కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ‌ద్వారా వీక్షించారు. కార్యక్రమం అనంతరం ఈటల రాజేందర్‌ ‌మీడియాతో మాట్లాడుతూ..1.25 లక్షల పీఎం కిసాన్‌ ‌సమృద్ధి కేంద్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయడం గొప్ప విషయమని కొనియాడారు.
దేశంలోని రిటైల్‌ ఎరువుల దుకాణాలను దశలవారీగా పీఎం కిసాన్‌ ‌సమృద్ధి కేంద్రాలుగా మారుస్తుందని, మలిదశలో లక్ష 75 వేల పీఎం కిసాన్‌ ‌సమృద్ధి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారని పేర్కొన్నారు. ఇవి రైతుల అనేక రకాల అవసరాలు తీరుస్తాయని, వ్యవసాయానికి అవసరమైన ముడిపదార్ధాలు(ఎరువులు, విత్తనాలు, పనిముట్లు), భూసార పరీక్షలు,, విత్తనాలు, ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలు అందిస్తాయని ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. వివిధ అంశాలపై  రైతులకు అవగాహన కల్పించడం, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం, బ్లాక్‌, ‌జిల్లా స్థాయి అవుట్‌లెట్‌లలో రిటైలర్‌ల  సామర్థ్యాన్ని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు పీఎం కిసాన్‌ ‌సమృద్ధి కేంద్రాల ద్వారా అమలు జరుగుతాయని ఈటల రాజేందర్‌ ‌వివరించారు. అమెరికా, పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌లాంటి దేశాల్లో యూరియా, డిఎపిని రైతులు కొనలేని ధరలు ఉన్నాయని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్‌ ‌రైతులకు సంవత్సరానికి 10 వేలు చేతులో పెట్టి అన్ని సబ్సిడీలని ఎత్తివేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పేరిట రైతులను దారుణంగా మోసం చేశారని ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో దోచుకుంటున్నాడని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.
ఫసల్‌ ‌బీమా యోజనపై నిర్లక్ష్యం..
కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఫసల్‌ ‌బీమా యోజన పథకాన్ని రూపొందిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్ర వాటాను ఇవ్వకుండా పథకాన్ని నిర్వీర్యం చేశారని ఈటల అన్నారు. దీంతో నేడు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రైతులు ఎన్నో నష్టాలు చవిచూస్తున్నారని, ఫసల్‌ ‌బీమా యోజన ఉంటే వారికి నష్టపరిహారం పెద్ద ఎత్తున వొచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పంట నష్టం జరిగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాటికి సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వం కారణమని ధ్వజమెత్తారు. ఫసల్‌ ‌బీమా యోజన పథకం ఉంటే నేడు రైతులకు న్యాయం జరిగేదని అన్నారు. కోట్లమంది రైతులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలు చేపడుతున్నామని, 18 వేల కోట్లు గురువారం రైతుల అకౌంట్స్‌లో జమ అయ్యిందని అన్నారు. స్వాతంత్య్రం వొచ్చి ఇన్నేళ్ల తరువాత రైతుల బాధలు, దుఖాన్ని అర్థం చేసుకొనే ప్రభుత్వం వొచ్చిందని, వారి మేలు కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని ఈటల అన్నారు. కిసాన్‌ ‌సమృద్ధి కేంద్రాలు ‘‘ఒన్‌ ‌స్టాప్‌ ‌సెంటర్‌’’ ‌రైతులకు అవసరం అయిన అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయని, ఇంకా 1 లక్ష 75 వేల ప్రధాన మంత్రి కృషి సంమృద్ధి కేంద్రాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.
కొరోనా మహమ్మారి వల్ల, ఉక్రెయిన్‌ ‌యుద్ధం వల్ల ఫెర్టిలైజర్‌ ‌ధరలు పెరిగినా కూడా ఆ భారం రైతుల మీద పడనీయలేదనీ యూరియా 2503 రూపాయలు ఉంటే రైతులకు 267 రూపాయలకు అందిస్తుందని, కేంద్రం 2236 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నదన్నారు. దేశంలో మెడికల్‌ ‌కాలేజీల సంఖ్యను గణనీయంగా పెంచామనీ, మాతృ భాషలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని, కలలు పెద్దగా కంటేనే ఫలితాలు పెద్దగా ఉంటాయని ప్రధానమంత్రి మోదీ మాటలను గుర్తుచేశారు. మోదీ 11 కోట్ల రైతులకు ప్రధాని సమ్మాన్‌ ‌నిధి ఇచ్చి ఆదుకున్నారని, ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధర పెరిగినా మన దేశంలో పెరగకుండా రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందిస్తున్నారని తెలిపారు. యూరియా, డీఏపి, 20-20  సంవత్సరానికి ఒక ఎకరానికి 20 వేల రూపాయల సబ్సిడీ అందిస్తున్నారు. 6 వేల రూపాయలు ప్రతి ఎకరానికి సమ్మాన నిధి కింద అందిస్తున్నారని వివరించారు. పంటకి 5 వేల రూపాయలు ఇచ్చి అన్నీ నేనే ఇచ్చిన అని కెసిఆర్‌ ‌చెప్పుకుంటున్నారనీ, అది ఇచ్చి అనేక పనిముట్ల సబ్సిడీ తొలగించారని అన్నారు.
పవర్‌ ‌స్ప్రే,  రోటావేటర్లు, చిన్న ట్రాక్టర్‌, ‌కల్టివెటర్‌ ఇవ్వడం లేదని, డ్రిప్‌, ‌గ్రీన్‌ ‌హౌస్‌ ‌సబ్సిడీ ఎత్తివేశారనీ, కెసిఆర్‌ ‌వొచ్చాక సబ్సిడీ విత్తనాలు లేవు, ఎరువులు లేవని, ఇదేనా అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ అం‌టే అని ప్రశ్నించారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 5 పైసలు ఇవ్వని కెసిఆర్‌ ‌మన డబ్బులు తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రైతులు బాగుంటే పల్లెలు, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందని గాంధీజీ చెప్పినట్టు గ్రామస్వరాజ్యమే మా లక్షం అని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రకటించారన్నారు. తాము వొస్తె నిజమైన రైతురాజ్యం తీసుకువస్తామన్నారు. కెసిఆర్‌ ‌మోసపు మాటలు నమ్మవొద్దని రైతాంగాన్ని కోరుతున్నానని ఈటల రాజేందర్‌ అన్నారు. షాద్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గం కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌టి. విజయ్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్‌ ‌రెడ్డి, అందే బాబయ్య రాష్ట్ర యువ నాయకులు ఏపీ మిథున్‌ ‌రెడ్డి, బిజెపి సీనియర్‌ ‌నేత పాలమూరు విష్ణువర్ధన్‌ ‌రెడ్డి తదితరులు సాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *