షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్ 02: జిల్లేడ్ చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మార్కెట్‌తో పాటు వ్యవసాయంలో ఇతర వివరాలను తెలుసుకుంటూ రైతువేదికల ద్వారా రైతులు బహుళ ప్రయోజనాలను పొందుతున్నారనీ షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అనంతరం ఏర్పాటు అయిన సమావేశంలో మాట్లాడారు. గతంలో పంటల సాగుతో పాటు వ్యవసాయంలో నూతన పద్ధతులు, యాంత్రీకరణ, ఇతర అంశాలపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించాలంటే వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖల అధికారులను వేదిక సమస్య వెంటాడేదని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ చలువతో రైతులకు ఆ సమస్య తీరిందని అన్నారు. రైతులకు రైతు వేదికల ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.




