ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : మండలంలోని వివిధ గ్రామాల రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని అరుణకుమారి తెలిపారు. శుక్రవారం రైతుల నుంచి వచ్చిన రైతు బీమా దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతు సోదరులందరూ తప్పనిసరిగా రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు భీమా కొరకు దరఖాస్తు చేయుటకు ఆఖరి తేదీ 5 – 8 – 2023 కావున రైతులు రైతు బీమా అప్లికేషన్ ఫారం తో పాటు పట్టాదారు పాసు బుక్కు జిరాక్స్, ఆధార్ జిరాక్స్ నామిని ఆధార్ జిరాక్స్, తో పాటు రైతుబిమా కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు కే.రాణి, మీనాక్షి, శివతేజ, సాయిరాం మరియు రైతులు పాల్గొన్నారు.




