సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: రైతులకు రుణ మాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలి. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్ వాల్ అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో రైతుల రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ గురించి జిల్లా అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.ముఖ్యంగా వివిద బ్యాంకులలో రైతు రుణమాఫీలు ఎపిజివిబి బ్యాంకు లో 7876 మంది రైతులకు గానూ 33.26కోట్లు, ఎస్బీఐ బ్యాంకు లో 2740మంది రైతులకు గానూ21.92కోట్లు, యుబిఐ బ్యాంకు లో2762 రైతులకు గానూ 15.45కోట్లు, ఇతరత్రా బ్యాంకులలో సుమారు 10272అకౌంట్లకు గానూ 25కోట్ల పెండింగ్ రైతు రుణమాఫీ నగదును వేగంగా రైతులకు అందజేయ్యాలని బ్వాంకర్లకు తెలిపారు.ఇప్పటి వరకు జిల్లాలో 1,72,592 మంది రైతులకు గాను 1320.68కోట్లు మంజూరు కాగ 90,471 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ 496.4కోట్లు అకౌంట్ జమ చేయబడ్డాయి. ఇప్పటి వరకు 66,272 రైతులు 394.71కోట్ల నగదు రూపంలో రైతులు వారి ఖాత నుండి తీసుకోవడం జరిగింది. మిగత దాదాపు 11,346 మంది రైతులు క్రాప్ లోన్ రిన్యవల్ చేసుకోవాలని కోరారు.డిబిటి పెల్యుర్ 199 పెండింగ్ లో ఉన్న అకౌంట్లకు రైతు రుణమాఫీ ఫోర్టల్ లో ఎస్బీఐ ,ఇతర బ్యాంకు అధికారులు డ్యాక్యమెంట్ అప్లోడ్ చెయ్యాలని కోరారు. లేని యెడల సర్టిఫై బ్యాంకు వారు లీడ్ బ్యాంకు అధికారులకు డాక్యుమెంట్లు అందజేయాలని కోరారు.ఆధార్ నంబర్ లేని వాళ్ళు గోల్డ్ లోన్ మాఫింగ్ కానీ వాళ్ళు, మరణించిన వాళ్ళు, ఇతర సాంకేతిక లోపాల ద్వారా రుణమాఫీ రాని రైతుల సమస్యల గుర్చి కమిషనర్ ఆప్ అగ్రికల్చర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారిస్తామని తెలిపారు.వివిధ బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న రుణాలను త్వరగా పూర్తి చెయ్యాలి. వ్యవసాయ అధికారులు ఎడిఎ, ఎఓ లు బ్యాంకర్ల దగ్గర నుండి వివిధ గ్రామాల్లో పెండింగ్ జాబితా మాదిరి బ్యాంకు మెనెజర్లతో కుర్చీని క్రాప్ లోన్ రిన్వల్ చేసి రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.బ్యాంకు మేనేజర్లు, ఆర్ఎం లు పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని వేగంగా తనకు అందించాలని ఎల్డిఎం కి తెలిపారు. తదుపరి సమాచారాన్ని వ్యవసాయ అధికారులకు అందించాలని తెలిపారు.తప్పనిసరిగా సమావేశాలను బ్యాంకర్ల ఆర్ఎంలు కచ్చితంగా హాజరుకావాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.కొత్త రుణాలు అందుకునేందుకు అర్హత కలిగిన రైతుల వద్దకు వ్యవసాయ అధికారులు వెళ్లి రైతులకు రుణాలకు సంబంధిత విషయాల గుర్చి తెలపాలి. ఎస్బీఐ, యుబిఐ, ఎపిజివిబి మరియు కోఆపరేటివ్ బ్యాంకు రోజుకు 100చొప్పున రుణాలను అందించాలి. రెండవ విడత విధి వ్యాపార రుణాలను మున్సిపాలిటీ పరిధిలో 1329మందికి వారం రోజుల లోపల మెప్మా అధికారుల సహయంతో బ్యాంకు మెనెజర్ లు అందించాలని అదేశించారు. అలాగే మొదటి లింకేజీ సంబంధిత అర్హులను గుర్తించి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయాలని ఆదేశించారు.సెర్ప్ లో, మెప్మా పరిధిలో బ్యాంకు లీంకెజిలో సంబందించిన ఎంసిపిలు బ్రాంచ్ మెనెజర్ సహకారంతో మంజూరు చెయ్యాలని కోరారు.అహర ఉత్పత్తి పిఎంఎప్ఎంఈ పరిధిలో గల 54యూనిట్లు వేగంగా పూర్తి చేయ్యాలన్నారు. అదే విధంగా 178అకౌంట్ల యూనిట్ల వారికి నగదు మంజూరు చెయ్యాలని బ్యాంకు అధికారులకు తెలిపారు.మాడల్ కోడ్ ఆప్ కండక్టు ఉన్నందున బ్యాంకు, వ్యవసాయ అధికారులు ఎలక్షన్ కమీషన్ జారి చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మెనెజర్ సత్యజిత్, డిఆర్డిఏ పిడి జయదేవ్ ఆర్యా, పీడి మెప్మా హనుమంత రెడ్డి, యుబిఐ ఆర్ఎచ్ వికాస్, ఎపిజివిబి ఆర్ఎం ఉదయ్ కిరణ్, టిజిబి ఆర్ఎం లక్షణ్, బ్యాంకు రిజనల్ అధికారులు, మెప్మా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రుణ మాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలి





