రైతులకు తాలు పేరుతో తెలుగు తీసి మోసం చేయరాదు

కుల్కచర్ల, ప్రజాతంత్ర డిసెంబర్ 06:రైతులకు తాలు పేరుతో తెలుగు తీసి మోసం చేయరాదని డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు బొలుసాని భీమ్ రెడ్డి అన్నారు.బుదవారంనాడు పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి కి  మెమొరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు..వరి కొనుగోలు చేసేందుకు రైతులకు సంచులు అందుబాటులో ఉండాలి.వరి కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా చూడాలి.రైతులకు తాలు పేరుతో తెలుగు తీసి మోసం చేయరాదు గత ప్రభుత్వంలో జరిగిన పొరపాటులను జరగకుండా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆంజనేయులు,బ్లాక్ బి అధ్యక్షులు భరత్ కుమార్ ,స్థానిక సర్పంచ్ సౌమ్య వెంకట్రాంరెడ్డి, రామ్ లాల్,సీనియర్ నాయకులు కనకo మొగులయ్య, మాజీ సర్పంచి జోగు వెంకటయ్య గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, రాము, బాలకృష్ణయ్య, భాస్కర్, చిన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *