జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: జగదేవపూర్ మండల పరిధిలోని తిగుల్ గ్రామంలో జాగృతి ప్రాజెక్టు లో భాగంగా యల్డిసి (యల్ డీసీ ), బేయర్ క్రాఫ్ సైన్స్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తి లో వచ్చు గులాబి రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, అఖిలేష్ వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సమయంలో గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉన్నదని రైతులు విత్తిన 45 రోజుల నుండి గులాబి రంగు పురుగు ఉనికిని గమనించడానికి లింగాకర్షక బుట్టలు అమర్చి వరసగా 3 రోజులు బుట్టలలో 8 తల్లిరెక్కల పురుగులు పడడం గమనించిన లేదా 10% శాతం గుడ్డి పూలు లేదా 10% శాతం పురుగు ఆశించిన కాయలు గమనించిన వెంటనె సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మరియు గుడ్డి పూలు ఎప్పటికప్పుడు ఏరి నాచనం చేయాలి.మందులు ఉదయం పూట 10 గం లోపు గాని సాయత్రం 7 గం లోపు గాని పిచికారీ చెయ్యాలని అన్నారు.గులాబీ రంగు పురుగు నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోఏట్ 0.5 గ్రా లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ లేదా క్వినాలోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి కొట్టాలని చూచించారు. పంట చివరి దశలో క్లోరోపైరిఫాస్ మరియు సైపర్ మెత్రిన్ 2 మిలీ లేదా ప్రొఫెనోఫాస్ మరియు సైపర్ మెత్రిన్ 2 మిలీ లీటరు నీటికి కలిపి కొట్టాలని చూచించారు .
ఈ కార్యక్రమంలో బేయర్ క్రాఫ్ సైన్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ వి. రాజశేఖర్ మాట్లాడుతూ ప్రత్తి పంటను జనవరి తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేను లో ఉంచు కూడదు అని,పంటకు నీరు, ఎరువులు పెట్టి పంట కాలాన్ని పొడిగించకూడదని చెప్పారు. మరియు ఎండాకాలం లో లోతు ధుక్కులు ద్వారా పురుగు ను నాశనం చెయ్యాలని చెప్పారు. లింగాకర్షక బుట్టలు పెట్టుకొని సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటలో గులాబి రంగు పురుగును నివారించుకొని మంచి నాణ్యమైన ప్రత్తి తీసుకోవాలని చూసించారు.అదేవిధంగా ఎల్డిసి కంపెనీ ప్రతినిధి చిట్టిమల్లి అఖిలేష్ మాట్లాడుతూ పత్తి నాణ్యత కాపాడుకొని మంచి దిగుబడి పొందాలని చెప్పారు, ప్రత్తి రైతులకు పోయిన సంవత్సరం నుండి ప్రత్తి లో వచ్చు గులాబీ రంగు పురుగు నివారణకు లింగాల కర్షక బుట్టలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంత రావు గారు, బేయర్ క్రాఫ్ సైన్స్ తెలంగాణ మేనేజర్ డి. లక్ష్మి నారాయణ, గ్రామ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ గారు, వ్యవసాయ విస్తరణ అధికారి శరణ్య,ఎల్ డి సి ప్రతినిధి యు. ఉపేందర్ రెడ్డి , బేయర్ క్రాఫ్ సైన్స్ ఆఫీసర్ డి. నరసింహా రెడ్డి,రైతుబంధు మండల కో ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, ఎమ్ పి టి సి మహేందర్ రెడ్డి, గ్రామ కో ఆర్డినేటర్ అశోక్ మరియు రైతులు సి. అంజిరెడ్డి, సుధాకరరెడ్డి, బి.పర్వతాలు,ఎమ్. మల్లారెడ్డి, పాల్గొన్నారు.



