రైతుబంధు ఇప్పుడు దేశానికే బంధు…!

భారతదేశం వ్యవసా యక దేశం,గత ఆరు దశాబ్దాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని సార్లు అభివృద్ధివైపు పయనించిన అనేక సార్లు అధోగతికి నెట్టినాయి. మంచి దేవుడెరుగు కానీ, చెడు మాత్రం కళ్ళముందు సాక్షాత్కరి ంచింది.ఉమ్మడి రాష్టంలో వ్యవ సాయ రంగం సంక్షోభానికి వర్షాభావం కారణమైతే, కొన్నేళ్లుగా సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు.రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రానికి సంబందించిన అంశం అయినా కేంద్ర ప్రభుత్వం డొల్లతనమైన విధానాలతో రాష్ట్రంలోని వ్యవసాయం అమితంగా ప్రభావానికి గురైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయరంగానికి అవసరమైన మేరకు చేయలేదని సుస్పష్టం. వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం పాలకవర్గాలు చేయలేదు. సమగ్ర వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేకపోయాయి.ఆసియా ఖండంలోనే జపాన్‌, ‌చైనా, వియాత్నం, కొరియా లాంటి దేశాలు వ్యవసాయరంగంలో అద్భుత విజయాలు సాధించాయి. అలాంటి  విధానాలు, కార్యక్రమాలను రూపొందించుకొని ఆచరణలో పెట్టలేనందు వల్లనే మన వ్యవసాయం నత్తనడక నడుస్తోంది. ఒకడుగు ముందుకు మరో అడుగు వెనుకకు నడుస్తుంది.

వ్యవసాయ రంగానికి అగ్ర తాంబూలం ఇస్తున్నామని, పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెబుతూనే వాస్తవంలో ఈ రంగం పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం చుపిస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు.పాలకుల ద్వంద వైఖరికి,కపట నీటికి వారి విధానాలే నిలువుటద్దాలుగా నిలిచాయి. 60ఏండ్ల గడ్డు పరిస్థితికి కారణమైన పాలకులను మర్చిపోక ముందే రైతు నడ్డివిరిచే బీజేపీ తెస్తున్న అదృశ్య చట్టాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దేశ ప్రజల ఆహారపు అవసరాలను తీర్చే రైతన్నకు భూమిపై అమితమైన ప్రేమ. దేశానికి అన్నం బెడ్తున్న అన్నదాతలు ఆకలికేకలతో , అప్పుల భారంతో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకోవడం కళ్లారా చూసి చలించిన కేసీఆర్‌ ‌రాష్ట్ర అవతరణ తర్వాత వ్యవసాయ భూములకు నీటి ఎద్దడిని ప్రాజెక్టుల ద్వారా తీర్చి,పెట్టుబడి సాయంగా ఎకరాకు పదివేలు రైతుబంధు అందించి,కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ ఆక్ట్ ‌పెట్టి, పంట నష్టపోతే పరిహారం అందించి రైతును రాజుగా తీర్చిదిద్ది, వలసలు పోనీ, ఆత్మహత్యలులేని రాష్ట్రంగా నిర్మించారు. నూతన రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎంతో పురోగతి సాధించింది. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడంతో నేడు తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారింది.రైతుదే తెలంగాణము రైతుదే అన్న దాశరథి కవివాక్కు అక్షర సత్యమైంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ఈరోజు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాయి.కాళేశ్వర గంగను బీడు భూములకు మళ్లించి నీటి గోస తీర్చడం, ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన ఉచి త కరెంటు అందించి, రైతుబంధుతో సాగుపెట్టుబడుల సమస్యను పరిష్కరించడం వంటి చర్యలు అపూర్వం, అద్వితీయం.తెలంగాణ మోడల్‌ ‌వ్యవసాయాన్ని దేశం అంతా విస్తరించేందుకు ‘‘అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌’’ అని జాతీయ గర్జన చేసే సాధికారత ఇచ్చిన పథకాలివి.ఇలా సేద్యం అభివృద్ధికి సృజనాత్మకమైన చొరవలు తీసు కోవడమే కాదు, ప్రకృతి విపత్తులతో పంటలు అతలాకుతలమైతే నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించి ఆదుకొన్న అచ్చమైన ‘రైతు బంధు’ మన సీఎం కేసీఆర్‌ ‌దేశానికే బందువుగా నిలిచారు. స్వయంగా రైతు అయిన సీఎం కేసీఅర్‌ ‌కష్టకాలంలో అన్నదాతకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నారు.

దేశంలో వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్న చిన్న,సన్నకారు రైతులే 85శాతానికి పైగా ఉన్నారు. పంటల సాగులో వీరికి పెట్టుబడి సకాలంలో కావాలి. సాగులో నిలదొక్కుకోవడానికి ఇది ఒక్కటి చాలు. దీనికితోడు రైతుబీమా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే వ్యవసాయ రంగంలో పురోగతి సాధ్యమవుతుందని ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు వ్యవసాయంపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. రైతు సంక్షేమం లక్ష్యంగా వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచింది.దేశంలో మొట్ట మొదటిసారిగా 1990లో కేంద్రం 10000కోట్ల రుణమాపీ చేసింది. దేశంలోని పంట రుణాలు నిజంగానే మాఫి చేయాలంటే 4లక్షల కోట్లు అవసరం. బడా పారిశ్రామిక వేత్తలు లక్షల కోట్లు అప్పులు జేసి దేశాన్ని దాటి పోయేందుకు సహా, ఎగవేతదారులకు 40నుండి 50శాతం వరకు రుణాలు మాఫిచేసేందుకు ముందుకు వచ్చే బ్యాంకులు రైతుల పట్ల సవతి ప్రేమ చూపెట్టడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారి ఆత్మహత్యలు ఒకవైపు, గ్రామాల్లో పంటల పెట్టుబడికి అధికవడ్డీతో అప్పు తీసుకోని తలకు మించిన భారంగా సాగు చేసి, అప్పుల ఊబిలో చిక్కుకొని పుస్తెలు తాకట్టు పెట్టిన తీరని భారం,ఆరుగాలం కష్ట%ళి%పడి పండించిన అన్నదాతకు ధాన్యం అమ్మబోతే అడవి కొనబోతే కొరివితో ఆకలి మంటలతో అల్లాడిపోయే పరిస్థితి ఉండేది.రైతు బంధు పథకంతో రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారి పోయింది. కేసీఆర్‌  ‌ప్రభుత్వం అందించిన రైతుబంధు ద్వారా రైతులు సాగు సంబురంగా సాగుతున్నది.అందుకే నాడు గంజి కేంద్రాలుగా ఉన్న తెలంగాణలో నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కన్పిస్తున్నాయి.

తెలంగాణలో రైతుబంధు ద్వారా రమారమి 70లక్షలమంది రైతన్నలకు నేరుగా ఎకరాకు 10వేల చొప్పున 65,500 కోట్లు అందించి కేసీఆర్‌ అన్నదాతకు ఆత్మబంధువై, కేసీఆర్‌ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించింది.అబ్‌ ‌కి బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ ‌నినాదంతో బయల్దేరిన బీఆర్‌ఎస్‌ అధినేతను స్వాగతిస్తున్నారు. వచ్చే ఏడాది రైతన్నకు నకిలీ విత్తనాల బెడదలేకుండా, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు రైతు వేదికలను సిద్ధం చేస్తున్నది.ఈ రోజు యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో ఉన్న వరిపైరు 94 లక్షల ఎకరాల్లో సింహభాగం ఒక్క తెలంగాణలోనే పండుతున్నది.ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 ‌మే 10న హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని శాలపల్లి వద్ద రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టి తన చేతుల మీదుగా రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. రైతుబంధు రైతులోకానికి సముద్రంలో దీపస్తంభం వంటిదని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే మెచ్చుకుంటే.. రైతులకు అంధకారంలో వెలుగురేఖ వంటిదని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ ‌స్వామినాధన్‌ ‌ప్రశంసించారు.రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో రైతుబంధు, రైతుబీమా పథకాలు ఒకటిగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.కనీస మద్దతు ధర,రుణమాఫీకి బదులుగా రైతులకు పెట్టుబడి సహాయం అందించడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్‌ ‌గులాటీ  ప్రశంసించడం గమనార్హం.ఆనాడు నెర్రెలుబాసి, నోళ్లు వెళ్ళబెట్టి,బీడు భూములుగా మారిపోయిన లక్షల ఎకరాల తెలంగాణ భూములు నేడు నిండు నీటిపారుదలకు నోచుకోని వెదజల్లుతున్న హరిత కంటి ప్రబలే తెలంగాణ మోడల్‌ ‌దేశానికి బంధుగా మారబోతున్నది. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జూన్‌ 2 ‌నుంచి మూడు వారాలపాటు దశాబ్ది వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, 2వ రోజు రైతు దినోత్సవం
image.png
డా।। సంగాని మల్లేశ్వర్‌
‌విభాగాధిపతి, జర్నలిజం శాఖ,కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌, 9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *